Asianet News TeluguAsianet News Telugu

వినాయక నిమజ్జనానికి జోరుగా ఏర్పాట్లు

  • వినాయక నిమజ్జానికి ప్రత్యేకంగా 15  ఘాట్ల ఏర్పాటు
  • 17వేల గణనాథుని విగ్రహాలను హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేయనున్నారు
GHMC builds 15 more immersion tanks for Ganesh visarjan hyderabad

గణనాథుని సందడి హైదరాబాద్ నగరంలో ప్రారంభమైంది. వినాయక చవితిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు  షురూ చేస్తున్నారు. కొందరు వినాయక విగ్రహాల కొనుగోలు ప్రారంభించేశారు. ఖైరతాబాద్ వినాయకుని విగ్రహ నిర్మాణం కూడా కొనసాగుతోంది. కాగా.. జీహెచ్ ఎంసీ కూడా తన పనులను ప్రారంభించింది. వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా వినాయక నిమజ్జానికి ప్రత్యేకంగా 15  ఘాట్లను ఏర్పాటు చేస్తోంది.

గతేడాది జీహెచ్ ఎంసీ నిర్మించిన ట్యాంకు (ఘాట్లు)ల్లో దాదాపు 3వేల గణనాథుని ప్రతిమల నిమజ్జనం జరిగింది. ఈ విగ్రహాలన్నీ దాదాపు 15 అడుగుల కన్నా తక్కువ ఉన్నవే. జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకంగా నిమజ్జనానికి ట్యాంకుల నిర్మాణం చేపట్టకపోతే.. విగ్రహాలన్నింటినీ హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేసే అవకాశం ఉంది. దీని వలన ట్యాంక్ బండ్ వద్ద ట్రాఫిక్ కూడా పెరిగిపోతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం విగ్రహాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. ట్యాంకులను మరో 15 నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.

కోర్టు నియమాల ప్రకారం ఈ సంవత్సరం  పొడవైన 17వేల గణనాథుని విగ్రహాలను హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేయనున్నారు. మిగిలిన విగ్రహాలను ట్యాంకుల్లో నిమజ్జనం చేస్తారు.

ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనం కారణంగా నీరంతా కాలుష్యం అవుతోంది. కావున హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ట్యాంకులను ఏర్పాటు చేశామని జీహెచ్ ఎంసీ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్  సూపరిండెంట్ ఇంజినీర్  శేఖర్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా నిమజ్జనం అయిపోయిన తర్వాత ఈ ట్యాంకులను మూసి వేస్తామని.. తిరిగి బతుకమ్మ ఇతర పండగలను తెరుస్తామని ఆయన తెలిపారు. కేవలం 15 అడుగల కన్నా తక్కువ ఉన్న విగ్రహాలనే ఇందులో నిమజ్జనం చేస్తామని చెప్పారు. సమీపంలోని నదుల నుంచి  ఈ ట్యాంకుల్లో నీటిని నింపుతామని.. నిమజ్జనం తర్వాత మురికి నీటిని బయటకు వదిలేస్తామని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios