భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో తన ఆటతో అభిమానుల మనసుల్లో చోటు దక్కించుకున్న గంభీర్  శనివారం 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

పలువురు క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా ఆయనకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. 2007 ఐసీసీ వరల్డ్ టీ20, 2011 వరల్డ్ కప్ లో గంభీర్ కీలక పాత్ర పోషించారు. ఆయన చివరగా గతేడాది ఇంగ్లాండ్ తో రాజ్ కోట్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఆడారు. టెస్ట్ మ్యాచ్ లలో గంభీర్ వీరేంద్ర సెహ్వాగ్ పార్ట్ నర్ షిప్ లో రికార్డు స్థాయిలో పరుగులు చేశారు.

 

సెహ్వాగ్ భాగస్వామ్యంతో గంభీర్ ఇప్పటి వరకు 87 ఇన్నింగ్స్ లో 4,412 పరగులు చేశారు.  అందులో 11 సెంచరీలు, 25 అర్థ సెంచరీలు ఉన్నాయి. 2009లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో గంభీర్ 11గంటల పాటు భారత్ తరపున బ్యాటింగ్ చేశాడు. 436 బాల్స్ కి 137 స్కోర్ చేశాడు.  ఐపీల్ మ్యాచ్ లలో గౌతమ్ కోల్ కత్తా నైట్ రైడర్స్  తరుపున ఆడారు.

గంభీర్ ఇప్పటి వరకు 58 టెస్టు మ్యాచ్ లు, 147 వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లు, 37 టీ20 మ్యాచ్ లు ఆడాడు. పదివేల పరుగులకు పైగా స్కోర్ చేసిన ఘనత గంభీర్ ది.