గల్లీ క్రికెట్ తో అలరించిన కోలకతా ప్రిన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో

టీం ఇండియా దాదా ... కోలకతా ప్రిన్స్... సౌరవ్ గంగూలీ...

భారత క్రికెట్ దిశనే మార్చిన డేర్ కెప్టన్...

క్రికెట్ కు దూకుడు నేర్పడటమే కాదు... షర్టు విప్పి విజయాన్ని ఏలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా చూపించాడు.

ఇప్పుడు క్రికెట్ కు దూరమయ్యాక కూడా దేశ క్రికెట్ కు తనవంతు సహకారం అందిస్తున్నాడు.

దేశంలో వంద కోట్ల మంది అభిమానించే క్రికెట్ కు కెప్టన్ గా రాణించిన గంగూలీ ఇప్పుడు కూడా తన మూలాలు మరవలేదు అనడానికి ఈ వీడియో నిదర్శనంగా నిలుస్తుంది.

ఎంత గొప్ప క్రికెటరైనా బ్యాటింగ్ లో ఓనమాలు నేర్చుకునేది మాత్రం గల్లీ లోనే... అందుకేనేమో ఆ గల్లీ క్రికెట్ చూసేసరికి సౌరబ్ కు మరోసారి తన చిన్ననాటి బాల్యం గుర్తొచ్చినట్లు ఉంది.

వెంటనే బ్యాటు తీసుకొని ఇలా టెన్నిస్ బాల్ తో గల్లీ లోనే క్రికెట్ ఆడేశాడు.

తన ఆఫ్ సైడ్ ట్రేడ్ మార్క్, ఫ్రంట్ ఫుట్ వర్క్ షాట్ లతో తన దూకుడు చూపాడు.