Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో గణేశుడి సందడి మొదలు

  • వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా చివరి ఘట్టమైన నిమజ్జనంపై వివిధ ప్రభుత్వ శాఖలు కాస్త ముందుగానే దృష్టి సారించాయి.
  • గణేష్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Ganesh Chaturthi Begins in Hyderabad with Gaiety

 

గణనాథుని సందడి హైదరాబాద్ నగరంలో ప్రారంభమైంది. వినాయక చవితిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు  షురూ చేస్తున్నారు. కొందరు వినాయక విగ్రహాల కొనుగోలు ప్రారంభించేశారు. ఖైరతాబాద్ వినాయకుని విగ్రహ నిర్మాణం కూడా కొనసాగుతోంది. నగరంలో పలువురు వినాయకుడు కొలువు తీరేందుకు మండపాలను కూడా నిర్మిస్తున్నారు.

వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా చివరి ఘట్టమైన నిమజ్జనంపై వివిధ ప్రభుత్వ శాఖలు కాస్త ముందుగానే దృష్టి సారించాయి. అన్ని శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించి గత సంవత్సరం మాదిరిగానే ఈసారి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా కాస్త ముందు నుంచే వ్యూహాన్ని సిద్దం చేస్తున్నాయి.

ఈనేపథ్యంలో బుధవారం జిహెచ్‌ఎంసి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. అన్ని శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు రంగంలో గణేష్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సుమారు ఇరవై మంది సిబ్బంది ఉండే ఒక్కో బృందానికి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల నిమజ్జనం రూట్‌ను కేటాయించనున్నారు.

బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు జరిగే నిమజ్జనం ప్రత్యేక ఊరేగింపు సందర్భంగా పారిశుద్ద్య పనులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిమజ్జనం రూట్లలో శానిటరీ సూపర్‌వైజర్లు, జవాన్లు 118 మంది, అలాగే శానిటరీ ఫీల్డు అసిస్టెంట్లు 475 మందితో పాటు 5వేల 305 మంది కార్మికులు రౌండ్ ది క్లాక్ విధులు నిర్వహించేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు ఎప్పటికపుడు చెత్తాచెదారాన్ని తరలించేందుకు జిహెచ్‌ఎంసి వద్దనున్న వాహనాల కాకుండా గత సంవత్సరం 182 వాహనాలను సమకూర్చుకోగా, ఈ సారి ప్రక్రియ మరింత వేగవంతంగా చేపట్టేందుకు వీలుగా 203 వాహనాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.

నగరంలో మొత్తం 287.9 కిలోమీటర్ల పొడువున నిమజ్జన ఊరేగింపులు జరగనున్నట్లు గుర్తించిన అధికారులు ఆయా మార్గాల్లో శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీసుల సూచన మేరకు రోడ్లకు, వీది ధీపాలకు మరమ్మతులు వంటివి చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం జరిగే రూట్‌లో రెండురోజుల పాటు అదనపు వెలుగులను ఏర్పాటు చేసేందుకు ట్రాన్స్‌ఫార్మర్లు, లైట్లను కూడా సమకూర్చనున్నారు.

గణేష్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌తో పాటు మరో 23 చెరువుల్లో నిమజ్జనం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు.సర్కిల్ 1లోని కాప్రా చెరువు, సర్కిల్ 3లోని సరూర్‌నగర్ చెరువు, సర్కిల్ 4లోని రాజన్నబావి, సర్కిల్ 6లో మీరాలం ట్యాంక్, పల్లె చెరువు, పత్తికుంట చెరువు, రఅలాగే సర్కిల్ 11లో దుర్గం చెరువు, మల్కంచెరువు, గోపీనగర్ చెరువు, సర్కిల్ 12లోని గంగారం సమీపంలోని పెద్ద చెరువు, జెపినగర్‌లోని గురునాథం చెరువు, హాఫీజ్‌పేటలోని కైదమ్మకుంట, మజీరారోడ్డులోని ఎర్ల చెరువుల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు సర్కిల్ 13లోని ఆర్సీపురంలోని రాయసముద్రం లేక్, పటాన్‌చెరువు సమీపంలోని సాకిచెరువు, సర్కిల్ 14లోని ఐడిఎల్ చెరువు, ప్రగతినగర్ చెరువు, హస్మత్‌పేట చెరువు, సున్నం చెరువులతో పాటు సర్కిల్ 15లోని పర్కిచెరువు, వెనె్నలగడ్డ చెరువు, సూరారం చెరువు, సర్కిల్ 16లోని ఆల్వాల్ కొత్త చెరువు, సర్కిల్ 17లోని సఫిల్‌గూడ చెరువుల్లో నిమజ్జనం ఏర్పాట్లు చేపట్టనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios