బెంగళూరు: గాలి జనార్దన్ రెడ్డి తనకు స్నేహితుడు మాత్రమేనని, పార్టీ రాజకీయాలతో గాలికి సంబంధం లేదని బిజెపి బాదామి అభ్యర్థి బి. శ్రీరాములు స్పష్టం చేశారు. బాదామిలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఆయన వెనకంజలో కొనసాగుతుండగా, మొలకల్మూరులో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

శ్రీరాములు మంగళవారం ఉదయం పూజలు చేసి హెలికాప్టర్ లో బాదామికి చేరుకున్నారు. బళ్లారిలో గాలి సోదరుల హవా కొనసాగుతోంది. గాలి కరుణాకరెడ్డి, గాలి సోమశేఖర రెడ్డి తమ తమ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

శికారిపురలో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మైసూరు కర్ణాటకలో కాంగ్రెసు, జెడిఎస్ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. బెంగళూరు నగరంలో బిజెపి హవా కొనసాగుతోంది. ముంబై కర్ణాటక, హైదరాబాదు కర్ణాటకల్లో బిజెపి ముందంజలో కొనసాగుతోంది.