గాలి అనుచరుడికి.. డిప్యూటీ సీఎం ?

First Published 15, May 2018, 11:36 AM IST
gali brothers lead ballary
Highlights

మరోవైపు గాలి జనార్దన్ రెడ్డి ముఖ్య అనుచరుడు

ఇప్పటికే బీజేపీ పార్టీ  అధికారందిశగా దూసుకెళుతుంది. దాదాపు 115 సీట్లలో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 67 స్థానాల్లో ముందంజలో ఉండగా మరో అదిపెద్ద పార్టీ జేడీఎస్ 37 కు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది.ఇక మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరవడంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. సర్వేలను తలకిందులు చేస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ నిలవడంపై బీజేపీ అగ్రనేతలు ఆనందంలో ఉన్నారు. ఇదిలావుంటే కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో భేటీ అయ్యారు. జేడీఎస్ తో పొత్తు గురించి చర్చించినట్టు సమాచారం. మరికాసేపట్లో ప్రకాష్ జవదేకర్ బెంగుళూరు బయలుదేరనున్నారు. మరోవైపు గాలి జనార్దన్ రెడ్డి ముఖ్య అనుచరుడు శ్రీరాములును డిప్యూటీ సీఎంగా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎంగా మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను ఎంపిక చేయనున్నారు. 

loader