మహిళా రేడియో జాకీని లైంగికంగా వేధించిన కేసులో  గజల్‌ శ్రీనివాస్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోనే  శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు. ఆ మహిళ తనకు ఇష్టపూర్వకంగానే మసాజ్ చేసిందని, ఆమెపై తనకెలాంటి దురుద్దేశం లేదని వెల్లడించారు.   

పోలీస్ స్టేషన్ లో గజల్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఆత్మసాక్షిగా చెబుతున్నాను. నాకు మహిళలంటే చాలా గౌరవం. మా సంస్థలోని మహిళా ఉద్యోగులతో కూడా అలాగే ఉంటాను. అలాంటి  నా మీద ఆమె ( జాకీ కుమారి) ఎందుకు ఫిర్యాదు చేసిందో అర్థం కావడంలేదు.  గతంలో నాకు జరిగిన యాక్సిడెంట్ మూలంగా  శరీరంలో కాల్షియమ్‌ పేరుకుపోయింది. దాన్ని తగ్గించుకునేందుకు పిజియోథెరపిస్ట్ సూచనల మేరకు మసాజ్ చేసుకుంటాను. కానీ ఓ రోజు ఫిజియోథెరపిస్ట్ రాకపోవడంతో ఈమె తనకు మసాజ్ తెలుసని చెప్పి ఇష్టపూర్వకంగానే మసాజ్ చేసింది. కానీ ఇప్పుడిలా తాను వేధిస్తున్నట్లు పోలీసులకు పిర్యాదు చేయడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. నాకు ఆమెపట్ల ఎలాంటి బ్యాడ్‌ ఇంటెన్ష్‌ లేదు..’అని అన్నారు.

ఇదే విషయంపై పంజాగుట్ట ఏసీపీ విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ... ఆమె పక్కా ఆధారాలు సమర్పించడంతోనే శ్రీనివాస్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తాను లైంగిక, మానసిక వేధింపులకు గురయ్యానంటూ ఫిర్యాదు ఇవ్వడమేకాక.. సంబంధిత వీడియో, ఆడియో రికార్డులను కూడా బాధితురాలు తమకు అందించిందని ఏసిపి తెలిపారు.  అందువల్లే గజల్‌ శ్రీనివాస్‌కు నోటీసులు ఇవ్వకుండానే నేరుగా అరెస్టు చేశామని తెలిపారు.  శ్రీనివాస్ ను ఈ రోజే కోర్టులో ప్రవేశపెట్టబోతున్నట్లు ఏసిపి తెలిపారు.

 

గజల్ శ్రీనివాస్ అరెస్ట్ వీడియో