జోగుళాంబ-గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని చిన్నపాడు గ్రామానికి చెందిన కూలీలు.. గద్వాల పట్టణంలోని జిన్నింగ్ మిల్లులో విధులు ముగించుకుని బొలెరో వాహనంలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ధరూర్‌ మండలం పార్చర్ల గేట్‌ దగ్గర ఆ వాహనం బోల్తా పడింది.   

   క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలాన్ని గద్వాల డీఎస్పీ పరిశీలించారు. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, మృతి చెందిన వారిని చిన్నపాడు గ్రామానికి చెందిన కొత్త వెంకటన్న, కోట్ల వెంకటన్న, కమ్మరి లోహిత్‌, కమ్మరి గీతమ్మ, ఎమునంపల్లి గ్రామానికి చెందిన అరుణమ్మగా గుర్తించారు.

 

యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియోలు కింద చూడండి