కర్ణాటకలో బాగా వీస్తున్న ‘గాలి’

First Published 15, May 2018, 9:41 AM IST
G Somashekar Reddy, Bellary constituency Karnataka election results 2018 LIVE updates: Reddy is leading
Highlights

ముందంజలో దూసుకుపోతున్న గాలి సోదరుడు

కర్ణాటక ఎన్నికల్లో గాలి సోదరులు తమ హవా చూపిస్తున్నారు. మైనింగ్ డాన్ గాలి జనార్ధన్‌రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్‌రెడ్డి బళ్లారి సిటీ అసెంబ్లీ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన బళ్లారి సిటీ నుంచి బీజేపీ అధ్యర్ధిగా రంగంలోకి దిగారు. అలాగే గాలి జనార్థన్‌రెడ్డి వర్గీయులు మొత్తం ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. గాలి కరుణాకర్‌రెడ్డి, శ్రీరాములు తదితరులు కూడా తమ సమీప అభ్యర్ధులపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే... ఓట్లు ఇంకా లెక్కింపు పూర్తి కాలేదు. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటుచేసి ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ ఓట్ల లెక్కింపులో మొత్తం 11వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు.

ఇక.. షికారిపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ సీఎం అభ్యర్థి యెడ్యూరప్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రామనగరిలో కుమారస్వామి, బళ్లారిలో గాలి సోమశేఖరరెడ్డి, చిక్ మగ్ ళూరులో బీజేపీ అభ్యర్థి సీపీ రవి, వరుణలో సీఎం కుమారుడు యతీంద్ర, చిత్తాపూర్ లో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గేలు ముందంజలో కొనసాగుతున్నారు.

loader