రోజుకో పండు ఆహారంలో భాగం చేసుకుంటే.. చాలా వరకు రోగాల నుంచి దూరంగా ఉండొచ్చని మన పెద్దలు చెబుతుంటారు. ఒక చిన్న గిన్నెడు పండ్ల ముక్కలు లేదా.. ఒక గ్లాస్ జ్యూస్ తాగిన మన కడుపు నిండినట్టుగా అనిపిస్తుంటే.. ఆకలి తీరడమే కాదు.. రోజంతా ఎనర్జటిక్ గా ఉండటానికి ఇవి సహాయపడతాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఫ్రూట్స్ కన్నా కూడా ఫ్రూట్ జ్యూసులకే ఓటు వేస్తున్నారు. నిజానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్..?

పండ్లు తినడం, లేదా వాటిని జ్యూస్ చేసుకుని తాగటం ఏదైనా ఒకటేకదా, దానికి ప్రశ్న ఏమిటని అనుకుంటున్నారా? పండ్లు తినడం కంటే జ్యూస్ చేసుకుని తాగటం మంచిదని చాలా మంది అభిప్రాయం. ఎందుకంటే… ఫ్రూట్ జ్యూస్ తాగటం వలన తక్షణం శక్తి వస్తుంది, దాహం తీరుతుంది, త్వరగా అయిపోతుంది, రసం వృదా కాదు , పైగా తాగటం తినటం కన్నా తేలిక కూడా! ఇలా అనేక కారణాలు వలన జ్యూస్ తాగటం మేలని చాలా మంది అనుకుంటారు.

కానీ పండ్లను రసం తీసుకుని తాగటం వలన కొన్ని అత్యంత విలువైన అంశాలను మనం కోల్పోతున్నాం. ఫైబర్ అంటే పీచు పదార్ధాలు పండ్లలోనే ఎక్కువగా ఉంటాయి. రసం తీసిన తరవాత మనం పారేసే పిప్పు ఈ పీచు పదార్దమే. జీర్ణశక్తిని సరిచేయడానికి, మలబద్దకం సరిచేయడానికి, వివిధ మినరల్స్ విటమిన్స్ అందించడానికి మనం రోజు తప్పనిసరిగా ఫైబర్ తినాలి.

పండ్లను తినడమే మంచిది. దీని వలన కడుపు నిండినట్టు అనిపించి వెంటనే ఆకలి వేయదు. దాని వలన బరువు కూడా పెరగం. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే జ్యూసలకన్నా కూడా పండ్లను తీసుకుంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.