శుక్రవారం నాటి రాశిఫలాలు

First Published 29, Dec 2017, 7:53 AM IST
friday horoscope is here
Highlights
  • ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేష రాశి: అనుకున్నవన్నీ సక్రమంగా జరుగుతాయి. మంచి విందు భోజనం కూడా లభిస్తుంది. భార్య సహకారంతో మరింత ముందుకి వెళ్తారు. తండ్రి గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మంచి భాగ్యాన్ని కలుగచేస్తాయి.

 వృషభ రాశి: తలచిన పనులకి ఆటంకాలు, వాయిదాలు ఎక్కువ పడతాయి. ఈ రోజు డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. దైవ బలం కూడా మీకు ఉంటుంది. పని వారి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా నడుస్తాయి.

మిథున రాశి: అనుకున్న పనులు వాయిదా పడతాయి. బంధు మిత్రుల కలయికలతో ఆనందంగా గడుపుతారు. అనవసర ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అన్ని విషయాలకు కూడా భార్య సపోర్టుగా నిలుస్తుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కర్కాటక రాశి: వ్యాపార అభివృద్ధికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లి గారి ఆశీర్వాదం కూడా ఉంటుంది మీకు. ఇంటికి సంబంధించిన పనులు శ్రద్ధగా పూర్తి చేస్తారు. పిల్లల ప్రవర్తన మీకు ఆనందాన్ని కలుగచేస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలను పొందుతారు.

 సింహ రాశి: దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరుల సహకారం లభించగలదు. పిల్లల యెందు బాధ్యతగా వ్యవహరించవలసి ఉంటుంది. దూరపు బంధువుల వార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కన్యా రాశి : ధన ప్రణాళికలు వేయవలసి ఉంటుంది. కొన్ని అవకాశాలు చేజారే ప్రమాదం ఉంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. రుణాలు కూడా చేయవలసి వస్తుంది. సహచరుల సహకారం ఉంటుంది.

తులా రాశి: అనుకున్న పనులు పూర్తి చేస్తారు. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలందు లాభం కలుగుతుంది.

వృశ్చిక రాశి: అనుకున్న పనులు నెమ్మదిగా సాగుతాయి. దూరపు ప్రాంత వార్తలు వింటారు. కొన్ని అవకాశాలు చేజారకుండా చూసుకోవాలి. కొన్ని అనవసర ఖర్చులు కూడా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

ధనూ రాశి: తలచిన పనులు పూర్తి చేయాలని ప్రణాళికలు వేసుకుంటారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. పిల్లలు అభివృద్ధి పథంలో నడుస్తారు. బంధు మిత్రుల పరిచయాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకర రాశి: చేయు పనులందు అడ్డంకులున్నాయి. ఇంటికి సంబంధించిన పనులు శ్రద్ధగా పూర్తి చేస్తారు. తల్లి గారి ఆనందానికై శ్రమ పడతారు. అనవసర ఖర్చుల నుండి జాగ్రత్తపడాల్సిన సమయం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభ రాశి: దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువుల రాకపోకలు ఉంటాయి. అధికారుల మెప్పు పొందుతారు. పని వారి సహకారం కూడా పూర్తిగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

మీన రాశి: ధన ప్రణాళికలు వేస్తారు. దైవ దర్శన ప్రాప్తి కూడా ఉంది. పిల్లల గురించి ఆలోచించవలసిన సమయం. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. ఉద్యోగస్తులు గౌరవ మర్యాదలు పొందుతారు.


 

loader