పిల్లలకు వేసవి సెలవులు ఉండటంతో చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం పాపికొండలు చూడడానికి వెళ్లారు. ఇలా సరదాగా నదిలో ప్రయాణిస్తూ ఆనందంగా గడపాలనుకున్నారు. కానీ ఇంతలోనే విషాద సంఘటన చోటుచేసుకుంది. స్నానానికి నదిలో దిగిన నలుగురు వ్యక్తులు నీటిలో మునిగి మృతి చెందారు.దీంతో విహార యాత్ర కాస్తా విషాద యాత్రగా మారింది. ఈ దుర్ఘటనకు సంబందించిన వివరాలిలు కింది విదంగా ఉన్నాయి.    

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ జిల్లా జగదల్‌పూర్‌కు చెందిన ఓ ఉమ్మడి కుటుంబానికి చెందిన 10 మంది విహారయాత్ర కోసం పాపికొండలు చూడ్డానికి వెళ్లారు. పాపికొండలు యాత్రలో సరదాగా గడిపిన వీరు రాత్రి శివగిరి గ్రామం వద్ద జాబిల్లి రిస్సార్ట్సులో బస చేశారు.  ఉదయం లేవగానే వీరంతా కలిసి రిసార్టే పక్కనే వున్న గోదావరి నదిలో స్నానానికి వేళ్లారు. అయితే నది లోతును అంచనా వేయలేక స్నానానికి దిగిన ఈ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు బాగా లోతులోకి వెళ్లి నీటిలో మునిగిపోయారు.  ఒడ్డున ఉన్న మిగతా వారు కేకలు వేయడంతో సమీపంలోని పడవల సిబ్బంది వచ్చి మునిగిపోయిన మోహన్‌రాఠీ (48), శివంగి రాఠీ(25), జగదీష్‌రాఠీ(40), అనికేత్‌రాఠీ(16)లను పైకి తీశారు. అపస్మారక స్థితిలోని వీరిని కోండ్రుకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా ఆపాటికే వారు మృతి చెందినట్లు వైద్యుడు తెలిపారు. ఇలా సనదాగా విహారయాత్రకు వచ్చి తమ కుటుంబీకులను కోల్పోయిన మిగతా కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.