అమెరికా ప్రమాదంలో ఎన్నారై కుటుంబం మృతి

four members of Indian American family killed in US
Highlights

స్థానిక ఈల్ నదిలో మృతదేహాలు గుర్తింపు

అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ కుటుంబం ప్రమాదవశాత్తు మృతిచెందారు. కాలిఫోర్నియాలో గత వారం రోజుల క్రితం గల్లంతయిన ఈ కుటుంబం ప్రమాదానికి గురై మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఈల్ నదిలో వీరు ప్రయాణిస్తున్న కారు పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులంతా మరణించారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. భారత సంతతికి చెందిన సందీప్ తొట్టపల్లి(41),సౌమ్య(38) భార్యాభర్తలు అమెరికాలో నివాసముంటున్నారు. వీరికి సిద్ధాంత్(12), సాచీ(9) అనే ఇద్దరు సంతానం ఉన్నారు. సందీప్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ శాంటా క్లారిటాలో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు. అయితే సందీప్ ఈ నెల 5వ తేదీన కుటుంబంతో కలిసి హోండా పైలట్ కారులో సరదాగా లాంగ్ డ్రైవ్ కి వెళ్లాడు. ఇలా వీరు పోర్ట్ ల్యాండ్ లోని ఒరేగాన్ నుంచి కాలిఫోర్నియాలోని శాన్ జోస్ కు వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. ఉదృతంగా ప్రవహిస్తున్న ఈల్ నదిలో కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. నదిలో విస్తృతంగా గాలించిన రెస్క్యూ బృందాలు హోండా కారుతో పాటు ఈ కుటుంబానికి చెందిన వ్యక్తిగత వస్తువులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇంకా ఈ ఎన్నారై కుటుంబసభ్యుల మృతదేహాల గురించి గాలింపు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.  
 

loader