Asianet News TeluguAsianet News Telugu

ఇదీ మాజీ చాయ్ వాలా దెబ్బ

చాయ్ వాలా జీవితాలు  మారలేదు. నోట్ల రద్దుతో  ఆ మాజీ చాయ్ వాలా దెబ్బ తీసింది మాత్రం నిజం అంటున్నాడు సిద్ధూ...

former tea  seller creates nightmare to tea seller

సిద్ధూ టి-హబ్ కుప్పకూలింది.

 

ఆయన జాతోడే తీసిన దెబ్బ నుంచి కోలుకుని మళ్లీ మంచి రోజులొచ్చేందుకు  ఎన్ని రోజులు పడుతుందో తెలియదంటున్నాడు సిద్ధూ.  కనీసం రెండు మూడునెల్లో మళ్లీ వ్యాపారం పుంజుకుంటుందనే ధైర్యం ఉంది.

 

హైదరాబాద్, హిమయత్ నగర్లో ఉండే సిధ్దూ టీ స్టాల్  మామూలుగా కిటకిట లాడుతూ ఉంటుంది.  విరామం లేకుండా నిరంతరం సాగే టి స్టాల్ లో  లంచ్ బ్రేక్  తీసుకోవడం కూడా కష్టమే. అందుకే, తను బయట కెళ్లినపుడు ’దుకణం‘ బంద్ కాకుండా ఉండేందుకు రోజుకు వంద రుపాయల వేతనంతో ఒక పార్ట్ టైం ఉద్యోగిని కూడా నియమించున్నాడు సిద్ధూ.

 

 ముఖ్యంగా ప్రతిరోజు మధ్యాహ్నం నాలుగునుంచి ఆరు దాకా సిద్ధూ టీ స్టాల్  టీ-హబ్ అయిపోతుంది.  ఈ చిన్న స్టాల్ లో దొరికేవి ఉస్మానియా బిస్కెట్లు, సిగరెట్లు మాత్రమే.  అయితే, రోజూ వ్యాపారం  రెండువేల అయిదొందల నుంచి మూడువేల దాకా నడిస్తుంది.

 

  గత  రెండువారాలుగా  సిద్దూ టి హబ్ బోసి పోతూ ఉంది. వచ్చేవాళ్లు బాగా తగ్గిపోయారు. దీనికి రెండు కారణాలు, ఒకటి, వచ్చే వాళ్లదగ్గిర చిల్లర లేకపోవడం, రెండు, వాళ్లిచ్చే వంద నోటుకి తన దగ్గిర చిల్లర ఇవ్వలేకపోవడం.  రెండు వారాల  కింద దారినపోయే ఎవరికయినా సిధ్దూ చిల్లర అలవోకగా, లేదనకుండా ఇచ్చేవాడు. ఇపుడాపరిస్థితి లేదు. 

 

 దీనికితోడు,  రెండు వేల నోటు పేరు చెప్పి అప్పు పెట్టేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది.

 

 ఇపుడు బిజినెస్ వేయి , పదిహేను వందల దాటటం లేదు. ఆదివారాలలో అసలు  వ్యాపారమే ఉండటం లేదు.

 

ఈ  పరిస్థితి గురించి  మాట్లాడమంటే, ‘ పెద్ద పెద్ద షాపులే కుల్లా అయి పోయాయి. మనమెంత సార్,’ అని చెప్పడమే తెలుసు సిధ్దూకి

 

‘నేను బాధపడ్తూ కూర్చుంటే పెదోళ్ల సంగతేమంటావ్, చూద్దాం ఎంతకాలం నడుస్తుందో,’ అంటాడు సిద్ధూగా పాపులర్ అయిన సిధ్ధప్ప.

 

మాజీ చాయ్ వాలా మోదీ దెబ్బ నుంచి ఏదో మూల దాక్కుని బతుకెళ్ల దీస్తున్నతాను కూడా తప్పించుకోలేకపోయానని  ఒక్క ముక్కలో చెబుతాడు.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios