రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ బుధవారం తన నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, సీనియర్ కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, సిపిఎం నేత ఏచూరిలతో పాటు ఎన్ సి పి అధ్యక్షుడు శరద్‌పవార్‌ల సమక్షంలో ఆమె తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ బుధవారం తన నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, సీనియర్ కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, సిపిఎం నేత ఏచూరిలతో పాటు ఎన్ సి పి అధ్యక్షుడు శరద్పవార్ల సమక్షంలో ఆమె తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
నామినేషన్ దాఖలుకు ముందు రాజ్ఘాట్ వద్ద ఆమె బాపూజీకి నివాళులు అర్పించారు. మీరా కుమార్ తన ప్రచారాన్ని గుజరాత్లోని సబర్మతీ ఆశ్రమం నుంచి ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం లో భాగంగా ఆమె జులై 3న హైదరాబాద్కు వస్తున్నారు. (ఫోటో నామినేషన్ కు వెళ్తున్నప్పటిది)
