Asianet News TeluguAsianet News Telugu

ఈ వాహనాల కథేంటో తెలుసా..?

  • కడప జిల్లాలో 12 ఫారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయాలు
  • వివిధ కేసుల్లో పట్టుబడినవి దాదాపు 1,500 వాహనాలు
Forest Officials Negligence Rendail Wood Seized Vehicles in kadapa

ఓ వ్యక్తి.. లారీలో అక్రమంగా ఎర్ర చందనం దుంగలు తీసుకొని వెళ్తుంటే పోలీసులు వాహనాన్ని అడ్డకున్నారనుకోండి ఏం జరుగుతుంది?  డ్రైవర్  లారీ వదిలేసి పారరవుతాడు. అప్పుడు అధికారులు లారీని తమ వెంట తీసుకొని వెళ్తారు. కేవలం ఎర్రచందనం అక్రమ రవాణా మాత్రమే కాదు.. గంజాయి తరలింపు, సరైన ధ్రువ పత్రాలు లేకుండా పోలీసులకు చిక్కడం లాంటివి జరిగినప్పుడు కూడా వాహనం అధికారుల చేతుల్లోకి వెళుతుంది.

  మరి అలా తీసుకువెళ్లిన వాహనాలను అధికారులు ఏమి చేస్తున్నారో తెలుసా.. తెలిస్తే నిజంగా షాకవుతారు. ఆ వాహనాలన్నింటినీ ఓ మూలన పడేస్తారట. అవి తుప్పుపట్టిపోయి.. శిథిలాలుగా మారిపోతున్నాయట. నమ్మశక్యంగా లేకపోయినా ఇదే జరుగుతోంది. ఇందుకు నిదర్శణం కడపజిల్లా

వివరాల్లోకి వెళితే.. కడప జిల్లాలో 12 ఫారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయాలున్నాయి. ఫారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయాలతో పాటు ఎక్సైజ్, పోలీసుస్టేషన్ల పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడినవి దాదాపు 1,500 వాహనాలు న్నాయి. బద్వేలు తాలూకాలో బద్వేలు, పో రుమామిళ్ల అటవీ కార్యాలయాల్లో పట్టుబడిన వాహనాలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఒక మూలన పడేయడంతో తుప్పుపట్టి పోతున్నాయి. అయినా కూడా అధికారులు వాటిని పట్టించుకో వడం లేదు. ఎక్కువగా ఎర్రచందనం తరలి స్తూ పట్టుబడిన లారీలు, కార్లు, సుమోలు, ఆటోలు వందల సంఖ్యలో అటవీశాఖ కార్యాలయంలో మగ్గుతున్నాయి. వీటిని  అధికారులు పూర్తిగా పట్టించుకోకపోవడంతో అవి   శిథిలావస్థకు చేరుకున్నాయి.

ఎర్రచందనాన్ని తరలించేందుకు కండీషన్‌లో ఉన్న వాహనాలనే ఉపయోగిస్తారు. అవి పట్టుబడితే అటవీశాఖ కార్యాలయానికి చేరతాయి. పట్టుబడిన వాహనాలను కొందరు అధికారులు, సిబ్బంది యథేచ్ఛగా ఉపయోగిస్తున్నారు. కొందరు సిబ్బంది పట్టుబడిన వాహనాల విడిభాగాలను తొలగించి విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అంతేకాక గతంలో పోరుమామిళ్ల ఫారెస్టు రేంజ్‌ కార్యాలయంలో నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలు కూడా మాయమైపోయాయి. వాహనాల బ్యాటరీలు, టైర్లు, ఇంజిన్లు వేరుచేసి అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. అయినా కూడా ఉన్నతాధికారులు ఈ విషయమై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. పట్టుకున్న వాహనాలను వేలంలో విక్రయిస్తే అటు పోగొట్టుకున్న యజమానులు గానీ, టెండర్లు వేసే వారు గానీ ఎక్కువ రేట్లకు వేలంలో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందిచి తగు చర్యలు తీసుకుంటూ.. వాహనాలు అలా వృథా కాకుండా ఉంటాయి.

Follow Us:
Download App:
  • android
  • ios