బావిలో పడ్డ చిరుతను ఎలా కాపాడుతున్నారో చూడండి (వీడియో)

First Published 14, Dec 2017, 6:08 PM IST
forest officers saved the leopard in assam
Highlights
  • బావిలో పడిన చిరుతను కాపాడిన అటవీ అధికారులు
  • అసోంలో ఘటన

 
 అసోం రాజధాని గువాహటి సమీపంలోని అటవీప్రాంతం నుంచి ఓ చిరుత పులి నగరంలోకి ప్రవేశించి కలకలం సృష్టించింది. అయితే జనాల మద్య గందరగోళానికి గురైన చిరుత పరుగెడుతూ గోకుల్‌నగర్‌లోని ఓ బావిలో పడిపోయింది.  సుమారు 35 అడుగుల లోతున్న ఈ బావిలో చిరుతను గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు సుమారు రెండు గంటల పాటు కష్టపడి చిరుతను బయటకు తీశారు. ప్రాణాలకు సైతం తెగించి చిరుతను కాపాడటానికి బావిలోకి దిగిన అటవీ సిబ్బందిని అందరూ ప్రశంసిస్తున్నారు.

loader