తొమ్మిదేళ్ల కుర్రాడు నాసా కు లేఖ రాశాడు. నా వయసు 9 సంవత్సరాలే అయినా.. ఈ ఉద్యోగానికి నేను సరిగ్గా సరిపోతాను.
నేను ఏలియన్ (గ్రహాంతర వాసి) ని నాకు మీరు ఉద్యోగం ఇవ్వండి అంటూ ఓ తొమ్మిదేళ్ల కుర్రాడు నాసా కు లేఖ రాశాడు. వివరాల్లోకి వెళితే.. గ్రహ రక్షణ అధికారి (ప్లానెటరీ ప్రొటెక్షన్ ఆఫీసర్) ఉద్యోగానికి అర్హత గల వారు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా నాసా ఇటీవలఓ ప్రకటన విడుదల చేసింది. కాగా.. తాను ఆ ఉద్యోగానికి అన్నివిధాలా సరిపోతానంటూ జాక్ డెవిస్ అనే తొమ్మిదేళ్ల కుర్రాడు లేఖ రాశాడు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఈ లేఖ సారాంశం ఇలా ఉంది.
‘ ప్రియమైన నాసా, నా పేరు జాక్ డెవిస్(9).ప్లానెటరీ ప్రొటెక్షన్ ఆఫీసర్ గా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను.

. నేను ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి మొదటి కారణం.. నన్ను మా అక్క ఏలియన్ అని పిలస్తుంది. అంతేకాకుండా అంతరిక్షం, ఏలియన్ లపై వచ్చిన అన్ని సినిమాలు నేను చూశాను. వీడియో గేమ్స్ కూడా ఆడాను. నేను చాలా చిన్నవాడిని కాబట్టి ఏలియన్ లాగే ఆలోచించగలను నాకు ఉద్యోగం ఇప్పించండి’ అని లేఖలో పేర్కొన్నాడు.ఆ చిన్నారి రాసిన లేఖను చూసిన నెటిజన్లు అధిక సంఖ్యలో స్పందిస్తున్నారు.
