80శాతం డిస్కౌంట్ సేల్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్

First Published 13, Feb 2018, 1:36 PM IST
Flipkart Valentines Day offers To offer discounts up to 80percent on laptops cameras and more
Highlights
  • మరోసారి భారీ ఆఫర్లు ప్రకటించిన ఫ్లిప్ కార్ట్

ప్రముఖ ఈ-కామర్స్  వెబ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా కొన్ని ఉత్పత్తులపై 80శాతం వరకు రాయితీలు ఇస్తోంది. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 పురస్కరించుకొని ‘‘ ది ఫ్లిప్ హార్ట్ డే’’ సేల్‌ పేరుతో వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేసే ఆఫర్ల ముందుకువస్తోంది. ఈ అమ్మకాల్లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై 14శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ది ఫ్లిప్‌హార్ట్‌డే కోసం లాగిన్ అయిన వినియోగదారులు దుస్తులు, బ్యూటీ, యాక్సెసరీలు, గృహోపకరణాలపై అదనంగా 14శాతం డిస్కౌంట్ పొందనున్నారు. 

ఎలక్ట్రానిక్ పరికరాలు ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, ట్యాబ్లెట్లు, పవర్‌బ్యాంక్‌లతో పాటు పలు యాక్సెసరీలలో కొన్నింటికి 80శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు పేర్కొంది. మొబైల్ ఫోన్లపై మాత్రం భారీ డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. బ్యూటీ, టాయ్స్‌, స్పోర్ట్స్‌, బుక్స్‌ పై 80 శాతం వరకు డిస్కౌంట్లను పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. టీవీ, హోమ్‌ అప్లియెన్స్‌ పై 70 శాతం వరకు, ఫర్నీచర్‌, డెకర్‌, ఫర్నీషింగ్‌ వాటిపై 40 శాతం నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్‌ చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. కనీసం 40 శాతం, 50 శాతం, 60 శాతం డిస్కౌంట్లతో 'ఫెంటాస్టిక్‌ డీల్స్‌' ను అందుబాటులో ఉంచుతామని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది.

 

loader