ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ మరోసారి భారీ ఆఫర్లను ప్రకటించింది. రిపబ్లిక్ డేని పురస్కరించుకొని ‘రిపబ్లిక్ డే సేల్’ ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ఈ సేల్ ఈ నెల(జనవరి) 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మాత్రమే వర్తిస్తుంది. స్మార్ట్ ఫోన్లు, హోం అప్లియన్స్, బ్రాండెడ్ డ్రస్సులు తదితర వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ముఖ్యంగా ల్యాప్‌టాప్‌లు, కెమెరా, యాక్ససరీస్‌పై 60శాతం వరకూ తగ్గింపు ప్రకటించింది. ఇక దుస్తులు, చెప్పులు, ఇతర వస్తువులపై 50 నుంచి 80శాతం వరకు  రాయితీ ఇస్తున్నట్లు పేర్కొంది. సిటీ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై 10శాతం క్యాష్‌ బ్యాక్‌ను ఇవ్వనుంది. ఇదిలా ఉండగా.. మరో ఈ-కామర్స్ వెబ్ సైట్  అమేజాన్ ఇండియా కూడా ‘‘ గ్రేట్ ఇండియా సేల్’’ పేరిట ఆఫర్లు ప్రకటించింది. అమేజాన్ సేల్  ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.  అమేజాన్ ప్రకటించిన మరుసటి రోజే ఫ్లిప్ కార్ట్ కూడా ప్రకటించడం గమనార్హం.