ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్  ఫ్లిప్ కార్ట్ మరోసారి భారీ సేల్ ప్రకటించింది. సూపర్ వాల్యూ వీక్ పేరిట ప్రకటించిన సేల్ ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనుంది. చాలా రోజుల తర్వాత ఫ్లిప్ కార్ట్ నుంచి భారీ డిస్కౌంట్ సేల్ ప్రకటన రావడంతో కష్టమర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సేల్ లో పలు కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్లపై వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ సేల్‌లో రూ.49కే కొత్త ఫోన్‌పై బైబ్యాక్ గ్యారంటీ ఆఫర్‌ను అందిస్తున్నారు. అలాగే బజాజ్ ఫిన్‌సర్వ్ ద్వారా నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో ఫోన్లను కొనుగోలు చేసే వీలు కల్పించారు. అదేవిధంగా పలు హ్యాండ్‌సెట్లపై ఫ్లిప్‌కార్ట్ ప్రొటెక్ట్ కింద ఎక్స్‌ టెండెడ్ వారంటీని అందిస్తున్నారు. పలు స్మార్ట్‌ ఫోన్లపై 50 శాతం బై బ్యాక్ గ్యారంటీని అందిస్తున్నారు. అనేక స్మార్ట్‌ ఫోన్లకు ఎక్స్‌ ఛేంజ్ ఆఫర్‌ను కూడా ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు కష్టమర్లు.. ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్ ని సద్వినియోగం చేసుకోవడం మొదలుపెట్టారు.