ఆక‌ర్ష‌ణీయ‌మైన రాయితీలు, ఆఫర్ల‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న‌ది. ఫ్లిప్‌కార్ట్ యాప్ లేదా సైట్ ఎందులో ఐట‌మ్స్‌ను కొన్నాఈ ఆఫ‌ర్లు ల‌భిస్తున్నాయి.

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరోసారి సేల్స్‌ ప్రకటించింది. ‘న్యూ పించ్ డేస్’ పేరుతో ఈ కొత్త సేల్‌ను లాంచ్‌ చేసింది . ఈ నెల 17వ తేదీ వ‌ర‌కు ఈ విక్రయాలను నిర్వహించనుంది. క్యాష్‌ బ్యాక్‌, డిస్కౌంట్‌ ఆఫర్లతో కస్టమర్లను ఊరిస్తోంది. ముఖ్యంగా ఈ న్యూ పించ్ డేస్ సేల్‌లో రెడ్‌మీ నోట్ 4, ఐ ఫోన్‌ 8 , గూగుల్ పిక్సల్ 2, పిక్స‌ల్ 2 ఎక్స్ఎల్‌, షియోమీ ఎంఐ ఎ1, మోటో ఎక్స్‌4, శాంసంగ్ ఫోన్లు, ఐఫోన్లు, మొబైల్ యాక్స‌స‌రీల‌పై ఆక‌ర్ష‌ణీయ‌మైన రాయితీలు, ఆఫర్ల‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న‌ది. ఫ్లిప్‌కార్ట్ యాప్ లేదా సైట్ ఎందులో ఐట‌మ్స్‌ను కొన్నాఈ ఆఫ‌ర్లు ల‌భిస్తున్నాయి.

 శాంసంగ్ గెలాక్సీ ఎస్‌7 రూ.29,990 (రూ.16,010 త‌గ్గింపు) ధ‌ర‌కు, గెలాక్సీ​ ఆన్‌నెక్ట్స్‌ పై రూ.11, 900కు లభిస్తోంది. గెలాక్సీ జే 3 ప్రొ, గెలాక్సీ​ ఆన్‌ 5పై డిస్కౌంట్‌ ఆఫర్‌. అలాగే గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ రూ.5,001 త‌గ్గింపుతో రూ.58,999 ధ‌ర‌కు ల‌భిస్తుండ‌గా, హెచ్‌టీసీ యూ11 రూ.44,999 (రూ.8,991 త‌గ్గింపు) ధ‌ర‌కు, పిక్సెల్ 2 రూ.39,999 (రూ.11,001 త‌గ్గింపు) ధ‌ర‌కు, యాపిల్ ఐఫోన్ 7 32జీబీ రూ.42,999 (రూ.6,001 త‌గ్గింపు) ధ‌ర‌కు, మోటో ఎక్స్‌4 (4జీబీ, 64జీబీ) రూ.20,999 (రూ.2వేల త‌గ్గింపు) ధ‌ర‌కు లభ్యం కానున్నాయి. షావోమీ ఎంఐ ఎ1 రూ.12,999 (రూ.2వేల త‌గ్గింపు) ధ‌ర‌కు, షావోమీ రెడ్‌మీ నోట్ 4 (4జీబీ, 64జీబీ) రూ.10,999 (రూ.2వేల త‌గ్గింపు) ధ‌ర‌కు , ఎంఐ మ్యాక్స్ 2 64జీబీ రూ.14,999 (రూ.2వేల త‌గ్గింపు) ధ‌ర‌కు, ల‌భిస్తున్నాయి. ఇవే కాకుండా మ‌రెన్నో ఫోన్ల‌పై భారీ డిస్కౌంట్లు ల‌భ్యం.

వీటితోపాటు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ పీసీలు, యాక్స‌స‌రీలపై కూడా ఈ సేల్‌లో ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల‌తో కొనుగోలు చేస్తే అద‌నంగా మ‌రో 10 శాతం డిస్కౌంట్ ల‌భిస్తుంది.