స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించిన ఫ్లిప్ కార్ట్

First Published 29, Dec 2017, 3:09 PM IST
Flipkart launches 2018 Mobiles Bonanza Sale
Highlights
  • ఫ్లిప్ కార్ట్ 2018 బొనాంజా సేల్
  • స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్.. స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ ఆఫర్లు ప్రకటించింది. మొబైల్స్ బొనాంజా సేల్ పేరిట ఈ ఆఫర్లను వెల్లడించింది. షియోమి ఎంఐ ఏ1, గూగుల్ పిక్సెల్ 2, గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ , మోటో జీ5 ప్లస్, రెడ్ మీ నోట్4, లెనోవో కే5 నోట్, సామ్ సంగ్ గెలాక్సీ ఎస్7 ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు ప్రకటించింది.

 షియోమి ఎంఐఏ1 మొబైల్ ధరపై రూ.1000 తగ్గించింది. అసలు ధర రూ.13,999 ఉండగా.. ఆఫర్ ధరలో రూ.12,999కే లభిస్తుంది. గూగుల్ పిక్సెల్ 2 ఫోన్ పై అయితే ఏకంగా 8వేల తగ్గింపు ఇచ్చింది. ఇక మోటో జీ5 స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.16వేలు కాగా.. ఆఫర్ లో రూ.9,999కే అందిస్తోంది. రెడ్ మీ నోట్ 4 ఫోన్ పై రూ.2వేలు తగ్గించింది. లెనోవో కే5 నోట్ ఫోన్ పై కూడా రూ.2వేలు తగ్గించింది. ఫోన్ ఎంఆర్పీ ధర రూ.13,499కాగా..రూ.11,481కే అందిస్తోంది.

సామ్ సంగ్ గెలాక్సీ ఎస్7 ఎంఆర్పీ ధర రూ.46వేలు కాగా.. ఫ్లిప్ కార్ట్ లో రూ.26వేలకే లభిస్తోంది. అంటే దాదాపు 20వేల తగ్గింపు. ఈ ఫోన్లన్నింటకీ ఈఎంఐ విధానం కూడా అందుబాటులో ఉన్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఈ   బొనాంజా ఆఫర్ జనవరి 3వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

loader