ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ మరోసారి డిస్కౌంట్ సేల్ ప్రకటించింది. సంక్రాంతి పండగను పురస్కరించుకొని యాపిల్ వీక్ ని ప్రారంభించింది. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లు, ఐప్యాడ్ లు, మ్యాక్ బుక్లు, వాచీలపై భారీ ఆఫర్లు ప్రకటించింది. డిస్కౌంట్లతో పాటు అదనంగా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపిన వారికి 8వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది. 

యాపిల్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఐఫోన్‌ ఎక్స్‌ 64జీబీ వేరియంట్‌ అసలు ధర 89వేల రూపాయలు. అదేవిధంగా 256జీబీ వేరియంట్‌ ధర రూ.1,02,000. ఈ రెండు స్మార్ట్‌ ఫోన్లపై కొనుగోలుదారులు 8వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. అంతేకాక రూ.18వేల వరకు ఎక్స్చేంజ్‌ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్‌ 8(64జీబీ) ధర 64వేల రూపాయల నుంచి 54,999 రూపాయలకు తగ్గింది. అంటే ఈ స్మార్ట్‌ ఫోన్‌పై 9వేల రూపాయల డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. అదేవిధంగా ఐఫోన్‌ 8 ప్లస్‌(64జీబీ) ధరను 73వేల రూపాయల నుంచి 66,499 రూపాయలకు ఫ్లిప్‌కార్ట్‌ తగ్గించింది. ఈ రెండు స్మార్ట్‌ ఫోన్లపై కూడా ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులపై 8వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది. అదేవిధంగా 18వేల రూపాయల వరకు ఎక్స్చేంజ్‌ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.