నేటి నుంచి ఫ్లిప్ కార్ట్ బొనాంజా సేల్

First Published 3, Jan 2018, 11:38 AM IST
Flipkart 2018 Mobiles Bonanza Sale started
Highlights
  • భారీ ఆఫర్లు ప్రకటించిన ఫ్లిప్ కార్ట్

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ ''బొనాంజా సేల్'' ప్రకటించింది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ ఆఫర్లను ప్రవేశపెట్టింది. జనవరి 3వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. 2018 బొనాం జా సేల్ పేరిట పెట్టిన ఈ ఆఫర్ లో వివిధ రకాల ఫోన్లపై డిస్కౌంట్లు పెట్టింది. ఈ ఆఫర్ లో ఐఫోన్8 ప్లస్, ఐఫోన్ 8,  షియోమి ఎంఐ ఏ1, గూగుల్ పిక్సెల్ 2, గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ , మోటో జీ5 ప్లస్, రెడ్ మీ నోట్4, లెనోవో కే5 నోట్, సామ్ సంగ్ గెలాక్సీ ఎస్7 ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు ప్రకటించింది.

ఏయే ఫోన్ పై ఎంత డిస్కౌంట్ ఉందో ఇప్పుడు చూద్దాం..

1.యాపిల్ ఐఫోన్8 ప్లస్(64జీబీ) ఫోన్ అసలు ధర రూ.73వేలు కాగా.. ఆఫర్ లోరూ.66,499కే అందిస్తున్నారు.

2.యాపిల్ ఐఫోన్ 8(64జీబీ) ఫోన్ అసలు ధర రూ.64వేలు. ఆఫర్ లో రూ.54,999కే అందిస్తున్నారు.

3.మోటో జీ5 ప్లస్ 32జీబీ ఫోన్ అసలు ధర రూ.16,999కాగా ఆఫర్ లో 9,999కే అందిస్తున్నారు.

4.షియోమి ఎంఐ ఏ1(64జీబీ) ఫోన్ అసలు ధర రూ.14,999కాగా.. అసలు ధఱ రూ.12,999

5.గూగుల్ పిక్సెల్ 2 ఫోన్ అసలు ధర రూ.61వేలు కాగా.. ఆఫర్ ధర రూ.47,999

6. షియోమి ఎంఐమిక్స్ 2(128జీబీ)ఫోన్ అసలు ధర 37,999కాగా.. ఆఫర్ లో 32,999కే అందిస్తున్నారు.

loader