ఒకరాత్రికి ఫీజు యాబై వేల నుంచి లక్ష...

First Published 18, Dec 2017, 11:31 AM IST
flesh parlours in hyderabad star hotels glam couch
Highlights
  • కేవలం ఇద్దరు సినీ నటులు వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు అని మాత్రమే అందరికీ తెలుసు. కానీ దీని వెనక పెద్ద కథే నడిచింది.

నగరంలో రెండు ప్రముఖ హోటళ్లపై టాస్క్ ఫోర్సు పోలీసులు, స్థానిక పోలీసులు కలిసి శనివారం రాత్రి చేసిన దాడుల్లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు. దొరికిన ఇద్దరు యువతులు సినీ నటులు కావడంతో ఈ ఘటన సంచలనం రేపింది. కేవలం ఇద్దరు సినీ నటులు వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు అని మాత్రమే అందరికీ తెలుసు. కానీ దీని వెనక పెద్ద కథే నడిచింది. ఆ ఇద్దరు యువతులు వెనక ఉన్నది ఎవరు? ఎంత మొత్తం తీసుకొని ఆ ఇద్దరు నటీమణులు ఈ వ్యభిచార కూపంలోకి అడుగుపెట్టారు..? వీరి గుట్టుని పోలీసులు ఎలా పట్టుకున్నారు..?

అసలేం జరిగిందంటే.. ముంబయికి చెందిన మోనిష్ కడకియా(56). ఇతను సినీ డైరెక్టర్, ఈవెంట్ మేనేజర్. బాలీవుడ్ లో పలు సినిమాలకు డైరెక్టర్ గా చేశాడు. అంతేకాదు పలు ఫ్యాషన్ షోలకు ఈవెంట్ మేనేజర్ గా కూడా చేశాడు.  గత శుక్రవారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో అతను ముంబయి నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చాడు. బంజారాహిల్స్ లోని ఓ స్టార్ హోటల్ కి చేరకున్నాడు. అతనితోపాటు ముంబయికి చెందిన 24ఏళ్ల యువతి కూడా ఉంది. ఆమె ఇటీవలే  తెలుగులో ఓ సినిమాలో నటించింది. ఆ సినిమా ఈ ఏడాది నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది. గుజరాత్ కి చెందిన ఈ యువతి.. ముంబయిలో స్థిరపడింది. రీసెంట్ గా తెలుగులో మరో సినిమాలో నటించేందుకు అంగీకరించింది కూడా.

వీరిద్దరూ కలిసి బంజారాహిల్స్ లోని హోటల్ కి చేరుకున్నారు.వీరు ఇక్కడికి రాకముందే మోనిష్ కడకియా.. వీరిద్దరి కోసం వేరువేరుగా డిసెంబర్ 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రూమ్స్ బుక్ చేశాడు. కస్టమర్స్ కి సేవలు అందించినందుకు గాను రోజుకి రూ.3లక్షలు ఇస్తానని ఆ యువతితో బేరం ఆడుకొని మరీ హైదరాబాద్ తీసుకువచ్చాడు. ఇందుకు గాను మోనిష్.. ఒక్కో కస్టమర్ నుంచి రూ.50వేల నుంచి రూ.1లక్ష దాకా వసూలు చేస్తాడు. ఆ యువతి దగ్గరికి వచ్చే వ్యక్తులు ఆమె తో గంట సమయం గడుపుతారు. అలా ఆ రోజుకి ఎంతమంది వస్తే అన్ని గంటలు ఆమె వారికి సెక్స్ సర్వీస్ చేయాలన్నమాట.

సరిగ్గా వీరు వచ్చిన సమయానికే మరో స్టార్ హోటల్ కి వెంకట్రావ్ అనే వ్యక్తి 20ఏళ్ల యువతితో వచ్చాడు. ఈ యువతి టీవీ నటి. ఈమె కలకత్తా నుంచి హైదరాబాద్ కి వచ్చింది. ఒకే విధంగా హోటళ్లకు వచ్చి.. అనూహ్యంగా పోలీసులకు చిక్కారు. విచిత్రం ఏమిటంటే మోనిష్, వెంకట్రావులకు అసలు పరిచయం లేదట. కానీ.. ఇద్దరూ ఒకేవిధమైన స్టైల్ లో ఈ రకం పనులు చేస్తున్నారు. మోనిష్ కడకియా ఇలాంటి పనులు చేయడంలో చాలా నేర్పరి. ఇదేమి అతనికి తొలిసారి కాదు. ప్రతి నెలా.. ఎవరో ఒక హీరోయిన్ ని స్టార్ హోటళ్లకి తీసుకొని వస్తుంటాడు. ఇక వెంకట్రావు మాత్రం కేవలం టీవీ సీరియల్ నటులను మాత్రమే తీసుకువస్తుంటాడు. అన్ని మెట్రో సిటీస్ లలో వీరి వ్యాపారం సాగుతుంది.

కస్టమర్స్ ని ఎంచుకునే విధానం కూడా చాలా కొత్తగా ఉంది. ఈ నటీమణులు స్టార్ హోటళ్లలో ఉంచి.. వీరు కస్టమర్స్ వేటలోపడతారు. కస్టమర్స్.. ఫోటోలను ముందుగా వాట్సాప్ లో తీసుకొని.. వారిని వేరే హోటళ్లలో కలుస్తాడు. డీల్ మొత్తం మాట్లాడుకున్న తర్వాత.. వారి ఆ యువతులు ఉన్న హోటళ్లకు తీసుకువస్తారట. ఈ తతంగం గురించి సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. దాదాపు 20రోజుల నుంచి దీనిపై నిఘా ఉంచారు. చివరకు విఠుల రూపంలో వెళ్లి వారిని పట్టుకున్నారు.

 

loader