ఆ స్పా చేయించుకుంటే.. హెచ్ఐవీ వస్తుందట

Fish pedicures and foot spas could spread HIV and hepatitis C
Highlights

ఇంత అద్భుతమైన ఫీలింగ్ కలిగించే ఈ స్పా చాలా డేంజర్

పని ఒత్తిడి, అలసట, నిద్రలేమి సమస్య ఏదైనా.. పరిష్కారం మాత్రం ‘ స్పా’ గా చూస్తున్నారు ఈ మధ్యకాలంలో చాలా మంది. బ్యూటీ పార్లర్లు, స్పా సెంటర్లు కుప్పలు కుప్పలుగా పెరిగిపోవడంతో.. ప్రజలు కూడా వాటివెంట పరుగులు పెడుతున్నారు. కొందరైతే అవసరం లేకున్నా, మరికొందరు బ్యూటీ కాన్షియస్ కోసం కూడా స్పా చేయించుకుంటన్నారు. అలా అందం కోసం చేయించుకునే స్పాలలో ఫిష్ ఫుట్ స్పా కూడా ఒకటి.

 ఒక నీటి తొట్టిలో.. చేపలను వదిలి.. ఆ తొట్టిలో మన పాదాలు పెట్టుకొని కూర్చోవడమే. అందులోని చేపలు వచ్చి.. పాదాలపై ఉన్న డెడ్ స్కిన్ ని తినేస్తాయి. అవి అలా కొరుకుతూ ఉంటే.. చెక్కిలిగింతలు పెట్టినట్టుగా ఉంటుంది.  చాలా మంది ఈ స్పా ని బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. అయితే.. ఇంత అద్భుతమైన ఫీలింగ్ కలిగించే ఈ స్పా చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. ఈ స్పా కారణంగా హెచ్ఐవీ, హెపటైటిస్ తదితర ప్రాణాంతక వ్యాధులు సోకే అవకాశముందని తేలింది. ఈ విషయమై గవర్నమెంట్ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పలు వివరాలు వెల్లడించింది.

 డయాబెటీస్, లేదా ఇమ్యూన్‌సిస్టం బలహీనంగా ఉన్నవారు ఫిష్ ఫుట్ స్పా చేయించుకునేందుకు దూరంగా ఉండాలని సూచించింది. ఇటీవలి కాలంలో ఫిష్ ఫుట్ స్పా అత్యంత ఆదరణ పొందుతోంది. ఈ విధానంలో చిన్నచిన్న చేపపిల్లలు మన శరీంపై ఉంటే డెడ్‌స్కిన్‌ను తినేస్తాయని చెబుతుంటారు. అయితే ఒక వ్యక్తి వినియోగించిన నీటిని తిరిగి మార్చకుండా మరో వ్యక్తి స్పా కోసం వినియోగించడం ప్రమాదకరమని పరిశోధనల్లో తేలింది. ఇటువంటి స్పాల కారణంగా ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాప్తిచెందుతాయని నివేదికలో హెచ్చరించారు. హెచ్ఐవీ లేదా హెపటైటిస్ బాధితులు ఎవరైనా ఈ స్పాలో పెడిక్యూర్ చేయించుకుంటే, వారి వ్యాధులు మరింత మందికి వ్యాప్తిచెందే అవకాశముందని తేలింది.

loader