ఇస్లామిక్ స్టేట్ పతనమవుతున్నందున టెర్రిరిస్టులంతా మళ్లీ అల్ ఖేదా కిందికి వస్తారని బిన్ లాడెన్ వారసుడు కలగంటున్నాడు

ఇతగాడి వయసు 28 సంవత్సరాలు. ఒకపుడు అమెరికాను గడగడలాడించిన ఇస్లామిక్ టెర్రిరిస్టు సంస్థ అల్ ఖేదా సంస్ధాపకుడు బిన్ లాడెన్ కుమారుడిదీ ఫోటో. పేరు హమ్జా బిన్ లాడెన్ . ఉసామా బిన్ లాడెన్ చనిపోయాక, ఈ సంస్థకు నాయకుడయ్యాడు. టెర్రరిస్టులందరిని కూడగట్టే పనిలో ఉన్నా, ఇతగాడి ఫోటో ఇంతవరకు ఎవరి కంటా పడలేదు. అయితే, ఈ మధ్య సిఐఎ విడుదల చేసి అల్ ఖేదా సమాచారం గుట్టలో ఇది కనిపించింది. హమ్జా బిన్ లాడెన్ తండ్రికి ముద్దుల కొడుకు. ఉసామాకు 20 మంది కొడుకులలో 15 వ వాడు. ఒక భార్య పేరు హమ్జా,ఆమె మూడో భార్య. చిన్నప్పటి నుంచి ఈ కు ర్రవాడిని ఉసామా వారసుడనే పెంచుతూ వచ్చారు. 9/11 దాడికి ముందు హమ్జా బిన్ లాడెన్ ఆఫ్ఘనిస్తాన్ లో తండ్రితోనే ఉండేవాడు.అక్కడే అతను ఆయుధాలను ప్రయోగించడం నేర్చుకున్నాడు. ఆమెరికా వరల్డ్ ట్రేట్ సెంటర్ మీద దాడి జరుగుతున్నపుడు హమ్జాని తండ్రినుంచి వేరు చేసి తీసుకెళ్లారు.అక్కడఇక్కడా తిరిగి ఇరాన్ చేరుకున్నారు. ఇరాన్ వారిని గృహనిర్బంధంలో ఉంచింది. అప్పటినుంచి ఇతగాడి వివరాలు తెలియడం లేదు. అబొత్తాబాద్ లో ఉసామా ని హతమార్చాక అమెరికన్లకి చాలా ఉత్తరాలు దొరికాయి. అందులో హమ్జారాసిన ఉత్తరాలు కూడా ఉన్నాయి. ‘నేను ఉక్కు మనిషిని. విజయానికైనా, వీర స్వర్గానికి సిద్ధం,’ అని ఒక ఉత్తరంలో రాసి ఉంది. ‘ఇప్పటికే మనసైన్యంలో ఎంతో మంది చేరుతున్నారు. నేను చేరలేకపోవడం బాధిస్తున్నది,’అని కూడా హమ్జా రాశాడు.

Scroll to load tweet…

హమ్జా గురించి తెలిసిందంతా అతని ఆడియో టేపులే. 2015లో తండ్రి వార్షీకం సందర్భంగా ఉసామా అమరవీరుడంటూ నివాళర్పించడం ఉన్న టేపు దొరికింది.

ఇపుడు హమ్జా వీడియో కూడా దొరికింది. అది హమ్జా పెళ్లి వేడుకను తీసిన వీడియో. వీడియోలో ఒక వ్యక్తి ఉసామబా బిన్ లాడెన్ ను పెళ్లి కొడుకు తండ్రి అని, హమ్జాని ముజాహిదీన్ రాకుమారుడని అనటం కనిపిస్తుంది.