హైదరాబాద్ నగరానికి సిక్కులకు విడదీయరాని అనుబంధం ఉంది. దక్షిణ భారత దేశంలో మొట్టమొదటిసారి సిక్కులు స్థిరపడిన ప్రాంతం హైదరాబాద్ నగరమే. ఓల్డ్ సిటీలోని కిషన్ బాగ్ లో వీరు సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మొదటి సిక్కు విలేజులు ఏర్పడింది కూడా ఇక్కడే.

కిషన్ బాగ్- హిమాయత్ సాగర్ రోడ్డులో తొలిసారిగా 1832లో గురుద్వారా ని నిర్మించారు. అపుడు పిడుగుపాటులో కొంత ధ్వంసమయింది. ప్రస్తుతం ఈ గురుద్వారా శిథిలావస్థు చేరుకునింది. మరొక వైపు పునర్ నిర్మాణం చేపడుతున్నారు.
ఈ విషయం పక్కనపెడితే.. రాతితో హైదరాబాద్ లో కట్టిన మొదటి కట్టడం గురుద్వారాయే . నిజాం రాజుల పరిపాలనలో హైదరాబాద్ ఉన్న సమయంలోనే సిక్కు సైనికులు ఈ నగరంలో అడుగుపెట్టారు.
 అప్పుడు హైదరాబాద్ ని నిజాం నాలుగో రాజు మిర్ ఫర్కుండా అలీఖాన్ నసీరుద్ దౌలా పరిపాలిస్తున్నారు.  నిజాం రాజ్యంలో భూమిశిస్తు  వసూలు కఠినంగా వసూలు చేయాలనుకున్నారు. దీంతో ఆ పన్ను వసూలు చేయడానికి సైనికుల అవసరం వచ్చింది. నిజాంకు సైనిక సహాయం కావాలంటూ నిజాం ప్రధాని మహారాజా చందూలాల్ పంజాబ్ పరిపాలకుడు మహారాజా రంజిత్ సింగ్ ని సంప్రదించారు. ఆయన అంగీకరించారు. చందులాల్ కోరిక మేరకు రంజిత్ సింగ్ సిక్కు సైనికులను పంజాబ్ నుంచి హైదరాబాద్ కి పంపించారు.

అలా సిక్కు సైనికులు దక్షిణ భారత దేశంలో అడుగుపెట్టారు. ఆ సిక్కు సైనికుల కోసం హైదరాబాద్ లో 200 ఎకరాలను నిజాం కేటాయించారు. ఆ తర్వా సిక్కు సైనికులతో మూడు వర్గాలు ర్పాటుచేశారు.అందులో రెండు వర్గాలు  రామ్ బాగ్, కిషన్ బాగ్ లలో స్థిరపడ్డాయి. సిక్కు సైనికుల ప్రార్థనల కోసం ఒక గురుద్వార నిర్మించారు. అదేకిషన్ బాగ్ గురుద్వారా.  100 సంవత్సరాలపాటు ఈ గురుద్వారలోనే సిక్కులు  మత కార్య్రక్రమాలు చేపట్టేవారు.