అమెరికాలో  హైదరాబాదీపై కాల్పులు

అమెరికాలో  హైదరాబాదీపై కాల్పులు

అమెరికా గన్ కల్చర్ కు ఓ ఇండియన్ బలయ్యాడు. షికాగో డాల్టన్ సిటీలోని  ఓ సూపర్ మార్కెట్ లో ఓ దోపిడీ దొంగ విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో అక్కడే వున్నఓ గుజరాతీ మృతి చెందాడు. ఈ కాల్పుల్లో మన హైదరాబాద్ వ్యక్తి ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు.

వివరాల్లోకి వెళితే గుజరాత్ కు చెందిన అర్షద్ వోరా అమెరికాలోని డాల్టన్ సిటీలో సూపర్ మార్కెట్ నడిపిస్తుంటాడు. ఎప్పటిలాగే గురువారం రోజు అర్షద్ ఉదయం 10 గంటలకు షాప్ ను ఓపెన్ చేశాడు. అయితే ఇందులో సరుకులు కొనడానికి అదే నగరంలో ఉంటున్న బాఖర్ హుస్సెన్ (55) సరుకులు కొనడానికి వెళ్లాడు.  అదే సమయంలో షాప్ లోకి చొరబడ్డ దుండగులు దొంగతనానికి తెగబడ్డారు. అయితే ఈ దొంగతనాన్ని అడ్డుకోడానికి అర్షద్ వోరా ప్రయత్నించగా అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ కాల్పులు అడ్డుకోడానికి ప్రయత్నించిన హైదరాబాద్ వాసి బాఖర్ పై కూడా దుండగులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాఖర్ పరిస్థితి కూడా విషమంగా ఉంది.

అయితే అమెరికాలో ఈ మద్య ఇండియన్స్ పై దాడులు సర్వసాధారణంగా మారాయి. జాత్యహంకారంతో కొన్ని దాడులు జరగ్గా, తమ ఉపాదిని కొల్లగొడుతున్నారని మరి కొంత మందిపై దాడు జరిగిన విషయం తెలిసిందే. ఈ కారణాలతోనే దాడులు జరుగుతున్నట్లు అక్కడున్న ప్రవాసీలు చెబుతున్నారు. ఇలాగే భావించి దుండగులు అర్షద్ కు చెందిన మార్కెట్ లో దొంగతనానికి తెగబడి ఉంటారని బావిస్తున్నారు. అయితే దుండగుల కాల్పుల్లో అర్షద్ మరణించడం, హైదరబాదీ గాయపడటంతో వారి కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.  

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అమెరికన్ పోలీసులు కాల్పులకు తెగబడిన దుండగుల కోసం గాలింపు చేపట్టారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page