గద్వాల జిల్లాలోని కాటన్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

గద్వాల జిల్లాలోని కాటన్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

 జోగులాంబ గద్వాల జిల్లాలోని కొండపల్లి  రహదారిలో ఉన్న జయలక్ష్మి కాటన్ ప్రెస్సింగ్ మిల్లులో  ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో  మిల్లులోని పత్తి భేళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రహాదంపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.
 ఈ ప్రమాద సమయంలో మిల్లులో మొత్తం 4 కోట్ల విలువచేసే పత్తి ఉన్నట్లు యజమాని తెలిపారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో మాత్రం 50 లక్షలు విలువచేసే పత్తి బేళ్లు దగ్ధమైనట్లు తెలిపారు.  సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos