బిగ్ బాస్ హౌస్ లో అగ్నిప్రమాదం రూ.10కోట్లకు పైగా ఆస్తి నష్టం
దేశవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పాపులారిటీ సంపాదించుకున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ హౌస్ లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. బెంగళూరు నగర శివారు బిదాడిలోని ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీలో నిర్మించిన కన్నడ బిగ్‌బాస్ హౌస్ లో ఈ ప్రమాదం జరిగింది. సగానికి పైగా బిగ్ బాస్ హౌస్ కాలిపోయింది.

విద్యుత్ షాట్‌సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. రామ్‌నగర్, చెన్నపట్నం, బెంగళూరు నుంచి ఫైర్ ఇంజిన్లను రప్పించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ సెట్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఆస్తి నష్టం సుమారు రూ.10కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రముఖ నటుడు సుదీప్ కన్నడ భాషలో ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు. ఇటీవలే ఈ హౌస్ లో బిగ్ బాస్ సీజన్ 5 ముగిసింది.
