Asianet News TeluguAsianet News Telugu

అక్కడ పబ్లిక్ లో సిగరెట్ కాలిస్తే నేరమే..

  • బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం నేరం⁠⁠⁠⁠
  • సెక్షన్ 268, సెక్షన్ 269 కింద కేసులు నమోదు
  • 8,7707మంది చలానాలు కట్టారు.⁠⁠⁠⁠
Fine for Smoking in Public Places

‘ బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం చట్టరిత్యా నేరం... పొగతాగడం ఆరోగ్యానికి హానికరం.. ధూమపానం చేయకండి.. చేయనివ్వకండి’ అంటూ సినిమా థియేటర్లు మొదలుకొని ప్రతిచోటా.. ప్రతిసారి మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. కానీ వాటిని పాటించే వారిని మాత్రం వేళ్లపై లెక్క పెట్టవచ్చు. బస్ స్టాండ్లలో, బస్సుల్లో తోటి ప్రయాణికులు ఇబ్బంది పడతారనే ఆలోచన లేకుండా ప్రవర్తిస్తుంటారు. అదే పంజాబ్ రాష్ట్రంలో   ఇలా ప్రవర్తిస్తే అక్కడి అధికారులు చూస్తూ ఊరుకోరు. కేసు నమోదు చేసి చలానా కూడా విధిస్తారు.

 

 ఈ ఏడాది కేవలం ఒక్క ఏప్రిల్ నెలలోనే పంజాబ్ రాష్ట్రంలో 8,7707 మంది బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగినందుకు చలానాలు కట్టారు. ఆ నెల పంజాబ్ రాష్ట్ర ఆదాయం రూ.4లక్షల పై మాటే. మొహాలీ ప్రాంతంలోనే 302 మంది చలానా కట్టినట్టు అధికారులు చెబుతున్నారు.

 

2003 సిగరెట్, పొగాకు నిరోధక చట్టం కింద, సెక్షన్ 268, సెక్షన్ 269 ప్రకారం వీరి వద్ద చలానాలను కట్టించుకున్నట్లు అధికారులు చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణ నిమిత్తమే తాము ఈ చర్యలు చేపడుతున్నామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

 

 విమానాశ్రయం, బస్ స్టాండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, పోస్టాఫీస్లు, మార్కెట్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ వంటివి బహిరంగ  ప్రదేశాల కిందకు వస్తాయని.. ఆ ప్రదేశాలలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios