వారసత్వపరంగా రావాల్సిన ఏ ఆస్తి పొందాలన్నా ఈ ధ్రువీకరణ పత్రం చాలా అవసరం ఏదైనా ఆస్తికి మీ పేరెంట్స్ నామినీస్ గా ఉంటే .. అవి కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. అందుకు మీరు వారసత్వపు ప్రమా ణ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది.

అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం సంభవించో.. మరేదైనా కారణంచేతో మీరు మీ తల్లినో లేదా తండ్రినో కోల్పోయారనుకుందాం. కన్నవారు దూరమైతే ఆ భాధ వర్ణాతీతం. వారి లోటును ఎవరూ తీర్చలేరు కూడా. అప్పటి వరకు వారి గొడుగులా మీకు అండగా ఉంటే.. మీరు ఆ గొడుకు కింద ఎలాంటి బాధలు లేకుండా సేద తీరారు. కానీ.. ఇప్పుడు ఆ భరోసా మనకు దూరమైంది. కానీ వారు అకస్మాత్తుగా మరణించడం వల్ల కుటుంబ బాధ్యత మీరే తీసుకోవాల్సి వచ్చిందనుకోండి. అంతేకాదు.. వారు అకస్మాత్తుగా చనిపోవడం వల్ల.. ఆస్తి వివారాలు ఎవరికీ అప్పగించలేదు. ఎంత ఆదాయం ఉంది.. ఎన్ని అప్పులు ఉన్నాయి లాంటి సమాచారం కూడా మీకు చెప్పలేదనుకుందాం. అప్పుడు ఏమి చేయాలి. ఆర్థికంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ సమయంలో ఆర్థికంగా కుటుంబాన్ని ఎలా నిర్వహించాలి. తక్షణం చేయాల్సిన పనులు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

 మరణ ధ్రువపత్రం తీసుకోవాలి..

మీ పేరెంట్ పేరు మీద గతంలో బ్యాంక్ ఎకౌంట్ ఉందనుకోండి. వారి మరణానంతరం దానిని మూసివేయాలనుకున్నా.. లేదా వారి ఖాతాలోని నగదును మీ ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేయాలనుకున్నా.. మీ పేరెంట్ మరణ ధ్రువీకరణ పత్రం చాలా అవసరం. కేవలం బ్యాంక్ ఖాతా మాత్రమే కాదు.. ఏదైనా ప్రాపర్టీ వారి పేరు మీద ఉన్నా.. దానిని మీ పేరు మీద మార్చుకోవడానికి కూడా ఇది చాలా అవసరం. ఇందులో మీరు గమనించాల్సింది ఏమిటంటే.. గతంలో మీ పేరెంట్ పొందుపరిచిన వివరాలు.. మరణ ధ్రువీకరణ పత్రంలోని వివరాలు ఒకేలా ఉండాలి. ఒక వేళ సరిగా మ్యాచ్ అవ్వకపోతే.. సమస్య ఎదురౌతుంది. అంతేకాదు.. మరణ ధ్రువీకరణ ప్రతం చాలా ముఖ్యమైనది కాబట్టి.. దానికి ఒకటికి మించి ఎక్కువ కాపీలను తీసుకుంటే మంచిది.

వారసత్వపరంగా రావాల్సిన ఏ ఆస్తి పొందాలన్నా ఈ ధ్రువీకరణ పత్రం చాలా అవసరం. అంతేకాకుండా.. ఏదైనా ఆస్తికి మీ పేరెంట్స్ నామినీస్ గా ఉంటే .. అవి కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. అందుకు మీరు వారసత్వపు ప్రమా ణ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది.

ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, రికార్డ్స్..

మీ పేరెంట్ అకస్మాత్తుగా చనిపోయారనుకోండి. గతంలో మీ కుటుంబ ఫైనాన్షియల్ మ్యాటర్స్.. మీ పేరెంట్స్ మీతో చర్చించలేదనుకుందాం. అప్పుడు ఇంట్లోని అన్ని పేపర్లు.. మీ పేరెంట్స్ డైరీలు వంటివి వెతికి అన్ని ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, రికార్డులను సేకరించాలి.

పెట్టుబడులు, అప్పులు, బాధ్యతలు..

మీ పేరెంట్ చనిపోయిన తర్వాత మీ ఖాతాకు కొంత మొత్తం వచ్చి చేరిందనుకుందాం. చేరిన మొత్తంలొ ఒక్కసారిగా పెట్టుబడులు ఎంత.. అప్పులు ఎంత అంటే తెలుసుకోవడం చాలా కష్టం. అది మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభావితం చేయవచ్చు. అలాంటి సమయంలో పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకోవాలి. అప్పుడు ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ ఖాతాకు సంబంధించి 5 సంవత్సరాల క్రితం నాటి స్టేట్ మెంట్స్ చూసినా మీకు ఒక అవగాహన వస్తుంది. సీఏ లాంటి ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్స్ ల సహాయం కూడా తీసుకోవచ్చు.

బ్యాంక్ ఖాతా, లాకర్, లోన్, క్రెడిట్ కార్డ్స్...

మీ పేరెంట్ చనిపోయిన తర్వాత వారి బ్యాంక్ ఖాతాను మూసివేయాలి. ఆ ఖాతాలోని నగదును మీ ఖాతాలోకి బదిలీ చేసేందుకు.. మరణ ద్రువీకరణ పత్రం, నామినీ డీటైల్స్ లతో అప్లికేషన్ సమర్పించాలి. లాకర్ ల విషయంలోనూ ఇదే విధానాన్ని పాటిస్తే సరిపోతుంది.

 క్రెటిడ్ కార్డ్ లు దుర్వినియోగం కాకముందే వెంటనే మూసివేయాలి. మీ పేరెంట్ తీసుకున్న రుణాలకు వారుల గల్ యాక్షన్ తీసుకోక ముందే మీరు వాటిని క్లియర్ చేసుకోవాలి. తర్వాత వారి వద్ద నుంచి ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకోవడం మాత్రం మరిచిపోవద్దు.

స్థిరాస్తి...

కారు, బైక్ లాంటి స్థిరాస్తులు ఏవైనా మీ పేరెంట్ పై ఉంటే.. ఆర్టీవో కార్యాలయంలో అప్లికేషన్ పెట్టుకొని మీ పేరు మీదకు మార్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల.. భవిష్యత్తులో మీకు కావాల్సినప్పుడు దానిని అమ్ముకోవడానికి వీలుంటుంది.

పెట్టుబడులు..

ఒక వేళ మీ పేరెంట్ మూచ్యువల్ ఫండ్స్, ఫిక్స్ డ్ డిపాజిట్స్, షేర్లు, పోస్టల్ సేవింగ్ స్కీమ్స్ లో పెట్టుబడులు పెడితే దానిని వెంటనే అప్ డేట్ చేయాలి. మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించి.. రావాల్సిన మొత్తాన్ని నామినీ ఎకౌంట్ లోకి పంపించుకోవచ్చు. నామినీ కూడా లేకపోతే.. వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించి మీ ఖాతాలోకి పంపించుకోవచ్చు.

అంతేకాదు.. మీ ఇంటి కరెంట్ బిల్లు, మున్సిపాలిటీ రిజిస్ట్రేషన్ వంటి వాటిపై కూడా పేరు మార్చాలి. మీ పేరెంట్ పేరు మీద ఉన్న సోషల్ మీడియా ఖాతాలు, ఈ మెయిల్ ఐడీలను కూడా వెంటనే మూసివేయాలి. ట్యాక్స్ డిపార్టెమెంట్ కి సంబంధించి బిజినెస్ ఓనర్ షిప్ డిటైల్స్ ని అప్ డేట్ చేయాలి. పాన్ కార్డును కూడా మూసివేయాలి.

అథిల్ షెట్టి, బ్యాంక్ జబార్.కామ్ సీఈవో