సంక్రాంతి పండగ పూట కుటుంబమంతా ఆనందంగా గడపాలనుకుంటారు. అయితే అదే పండగ రోజు మద్యం మత్తు ఓ కుటుంబం లో విషాదాన్ని నింపింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. 


వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం వెల్లలచెరువు గ్రామంలో బ్రహ్మనాయుడు అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అయితే పండగ పూట అతడు మద్యం మత్తులో తన కొడుకుతో గొడవ పడ్డాడు.  అతడి  కొడుకు కూడా మద్యం సేవించి ఉండటంతో ఇద్దరు మద్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ ఘర్షణలో  బ్రహ్మనాయుడు తన కొడుకును ఇనుప రాడ్ తో కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.  ఈ హత్య తర్వాత నిందితుడైన తండ్రి పరారీలో ఉన్నాడు. 

ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.