Asianet News TeluguAsianet News Telugu

ఇదిగో ప్లాస్టిక్ బియ్యం...

ఆ ప్లాస్టిక్ బియ్యాన్ని కాస్త రుచి చూస్తే పోయేదేముంది. పోతే పేదోడి ప్రాణాలు పోతాయి. మన జేబులైతే నిండుతాయి కదా.

Fake plastic rice seized in Nigeria

 

ప్రపంచమంతా ప్లాస్టిక్ మయం అయిపోతుంది. అలాంటప్పుడు బియ్యం మాత్రం ప్లాస్టిక్ అయితే తప్పేముంది.

 

ఆ ప్లాస్టిక్ బియ్యాన్ని కాస్త రుచి చూస్తే పోయేదేముంది. పోతే పేదోడి ప్రాణాలు పోతాయి. మన జేబులైతే నిండుతాయి కదా.

 

కమ్యూనిస్టు చైనా ఇప్పుడు నమ్ముతున్న సిద్దాంతం ఇదే. మేడిన్ చైనా పేరుతో ప్రతి వస్తువును ప్లాస్టిక్ మయం చేసి ప్రపంచం మీదికి వదిలేస్తున్న  ఈ డ్రాగన్ కంట్రీ ఇప్పుడు బియ్యాన్ని కూడా వదలడం లేదు.

 

ప్లాస్టిక్ బియ్యాన్ని తయారు చేసి పేద దేశం నైజీరియాకు అంటగట్టాలనుకుంది. అక్కడ మోసగాళ్లు ఈ నకిలీ బియ్యాన్ని తక్కువ ధరకు పేదలకు అమ్మేందుకు సిద్ధమయ్యారు. అయితే సకాలంలో కస్టమ్స్ అధికారులు ఈ విషయం కనిపెట్టారు.

 

2.5 టన్నుల ప్లాస్టిక్ రైస్ బ్యాగులను పట్టుకున్నారు. బెస్ట్ టమాట రైస్ పేరుతో ఉన్న105 బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.

 

నైజీరియాలో ఉన్న ఆహారపు కొరతను అవకాశంగా తీసుకొని కొందరు మోసగాళ్లు ఈ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది.

 

ఈ ప్లాస్టిక్ రైస్ తింటే జీర్ణ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు కేన్సర్ వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే పలు పరిశోధనల్లో వెల్లడైంది.

Follow Us:
Download App:
  • android
  • ios