Asianet News TeluguAsianet News Telugu

అప్పుడే నకిలీ కరెన్సీనా

 అసలు రూ. 2 వేల నోట్లను ఇంకా చాలా మంది చేతితో తాకను కూడా లేదు. అప్పుడే నకిలీ నోట్లు చెలామణిలోకి వచ్చేసిందంటే విజయవాడ నిజంగా ఎంత హైటెక్ అయిపోయిందో అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

fake currency in Vijayawada

రాజధాని ప్రాంతమైన తర్వాత విజయవాడ బాగా స్పీడ్ అయిందని తెలుసుగానీ మరింత ఇంత స్పీడ్ అయిందా అని పలువురు ఆశ్చర్యపోతున్నారు. రిజర్వ్ బ్యాంకు ఇలా రూ. 2 వేల నోట్లను విడుదల చేసిందో లేదో అప్పుడే లక్షల కొద్దీ నకిలీ నోట్లు విజయవాడలో చెలామణిలోకి వచ్చేసింది. శనివారం రూ. 16 లక్షల విలువైన పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇస్తామని ఓ వ్యక్తని మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. అంటే మోసం చేసిన వారి వద్ద ఇంకా ఎంత భారీ భారీస్ధాయిలో నకిలీ నోట్లున్నాయో అని పలువురు విస్తుపోతున్నారు.

 

 అసలు రూ. 2 వేల నోట్లను ఇంకా చాలా మంది చేతితో తాకను కూడా లేదు. అప్పుడే నకిలీ నోట్లు చెలామణిలోకి వచ్చేసిందంటే విజయవాడ నిజంగా ఎంత హైటెక్ అయిపోయిందో అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. పైగా ఎవరికైనా అసలు, నకిలీ నోట్లు రెండింటినీ చూపిస్తే నకిలీ నోట్లే అసలు నోట్లనుకుంటున్నారట కూడా. అసలే కరెన్సీ కష్టాలతో ప్రజలు నానా అవస్తలు పడుతున్నారు. అవసరాలకు చేతిలో చాలినంత డబ్బు లేక, ఉన్న పాత నోట్లను ఎలా మార్చుకోవాలో అర్ధం కాక మరికొందరు అవస్తలు పడుతున్నారు.

 

ఇదిలావుండగా ఒకపుడు తమ అభిమాన నటుడి కొత్త సినిమా రిలీజ్ అవుతున్నదంటే అభిమానులు తెల్లవారిజుమునుండే సినిమా థియేటర్ల వద్ద క్యూలైన్లలో నిలబడేవారు. అదేవిధంగా, పాస్ పోర్టు కోసమో లేక వీసా కోసమో ఒకపుడు అర్ధరాత్రి నుండో బారులు తీరేవారు. అదే విధంగా గడచిన పది రోజులుగా కొత్త నోట్ల కోసం, పాత నోట్ల మార్పిడి కోసం జనాలు అదే విధంగా బారులు తీరుతుండటం విశేషం.

 

కరెన్సీ కోసం బారులు తీరుతున్న జనాలను అదుపులో పెట్టటమే పోలీసులకు కష్టంగా తయారైతే, ఇపుడు చెలామణిలోకి వచ్చిన నకిలీ నోట్లతో పోలీసులకు సరికొత్త తిప్పలు వచ్చి పడ్డాయి. రాజధాని కాకముందే రాష్ట్రం మొత్తం మీద కృష్ణా, గుంటూరు జిల్లాలకు నేరాల్లో పెద్ద పేరే ఉంది. అటువంటిది ఇపుడు కొత్తగా కొత్త నోట్లకు నకిలీ నోట్ల తయారీ కూడా వచ్చి చేరింది. అది కూడా భారీ ఎత్తున తయారు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి, ప్రభుత్వం ఈ సమస్యలను ఆదిలోనే ఎలా తుంచేస్తుందో చూడాలి.

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios