నిన్న సాయంత్రం నుంచి పలువురి ఫేస్ బుక్ ఖాతాలు ఓపెన్ కావడంలేదు. దీంతో సర్వత్రా గందరగోళం నెలకొంది

ప్రస్తత కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగించని వారు చాలా అరుదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు వారు ఆ స్మార్ట్ ఫోన్ల సహాయంతో సోషల్ మీడియాతో కనెక్ట్ అయ్యి ఉంటారు. అందులోనూ అందరూ ఎక్కువ ఉపయోగించేది ఫేస్ బుక్ నే. ఒక పూట భోజనం చేయకుండానైనా ఉంటారేమో కానీ.. ఫేస్ బుక్ చూడకుండా మాత్రం ఉండలేరు అన్నంతగా మారుతున్నారు. గంటల తరబడి ఫేస్ బుక్ లో గడిపేస్తూ ఉంటారు. ఇదొక వ్యసనంలా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఒక రోజంతా ఫేస్ బుక్ ఓపెన్ కాకపోతే.. అదే జరిగింది. నిన్న సాయంత్రం నుంచి పలువురి ఫేస్ బుక్ ఖాతాలు ఓపెన్ కావడంలేదు.

దీంతో సర్వత్రా గందరగోళం నెలకొంది. చాలా మంది ఫేస్ బుక్ యూసర్స్.. తమ అకౌంట్లు ఓపెన్ కావడం లేదని ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచి ఈ సమస్య తలెత్తిందని వారు చెబుతున్నారు. కొంత మందికి ఓపెన్ అయినా.. ఫోటోలు, వీడియోలు, ఇతర పేజీలు ఓపెన్ అవ్వడం లేదని.. లోడ్ అవుతూ కనపడుతుందని చెప్పారు. ఈ విషయాన్ని పలువురు ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేశారు. ఫేస్ బుక్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ విధంగా జరిగిందని సంబంధిత అధికారులు తెలియజేశారు.

కొద్ది సమయం తర్వాత తిరిగి ఫేస్ బుక్ పనిచేసింది. దీంతో యూసర్లు ఊపిరి పీల్చుకున్నారు. యూరప్, అమెరికా, బ్రెజిల్, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఫేస్ బుక్ యూజర్లు ఉన్నారు. కాగా.. ఈ సమస్య అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో తలెత్తినట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఫేస్ బుక్ లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని పరిష్కరించినట్లు చెప్పారు