క్లిక్ టూ వాట్సాప్ అంటున్న ఫేస్ బుక్

క్లిక్ టూ వాట్సాప్ అంటున్న ఫేస్ బుక్

సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్ బుక్ ప్రకటనల ఆధారంగా ఎంతో మంది బిజినెస్‌లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరింత మంది యూజర్లను తమ సొంతం చేసుకునేలా ఫేస్‌బుక్‌ తాజాగా క్లిక్‌-టూ-వాట్సాప్‌ పేరుతో ఓ ఫీచర్ ను ప్రారంభించింది. ఈ ఫీచర్ ప్రత్యేకత ఏంటంటే... 100 కోట్ల మంది వాట్సాప్‌ యూజర్లను అడ్వర్‌టైజర్లు కనెక్ట్‌ చేసుకోవచ్చు. 

ముఖ్యంగా ఈ క్లిక్‌-టూ-వాట్సాప్‌ బటన్‌ను యాడ్‌ చేయడం ద్వారా, వ్యాపారస్తులు తమ ఉత్పత్తులను చాలా త్వరగా ప్రజలకు చేరవేయడానికి ఉపయోగపడుతుంది. కాకపోతే యూజర్లు ఉత్పత్తుల గురించి సంభాషణ జరుపడానికి తమ కాంటాక్ట్స్‌ లో వ్యాపారస్తుల వాట్సాప్‌ నెంబర్లను యాడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం 10 లక్షల పేజీలు, వాట్సాప్‌ నెంబర్లను తమ పోస్టులకు జతచేర్చాయి. ఇప్పటికే ఇది ఉత్తర, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియాలో పలు ప్రాంతాల్లో సంస్థ ప్రారంభించింది. 
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page