ఈ రోజు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి 1953 లోఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ఆయన ఎమ్మెల్యే కాదు సాంఘిక జీవితంలో ఆయన గొప్పవాడయినా, రాజకీయాల్లో ఆయన కు చుట్టూరు శత్రువులే దీనివల్లే రెండు సార్లు ముఖ్య మంత్రి అయినా ఏడాది కంటే ఎక్కువ కాలం ఉండేలేకపోయారు
ఈ రోజు స్వాతంత్య్ర యోధుడు, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి. సాంఘికంగా ఆయన గొప్ప త్యాగ శీలి. ఎంతో ఆదాయం వస్తున్న న్యాయవాద వృత్తిని తృణీకరించి స్వాతంత్య్రోద్యమంలోకి దుమికాడు. సైమన్ కమిషన్ వచ్చినపుడు కాల్చుకోవోయ్ అంటూ చొక్కా గుండీలు తీసి గుండెచూపి తెల్లవాడి తుపాకి గుండుకెదురుగా నిలబడి హడల కొట్టిని వాడు. అందుకే ఆంధ్రకేసరి అనిపించుకున్నారు. అవినీతి ఆయన్నంటుకోలేకపోయింది. రెండు సార్లు ముఖ్యమంత్రి అయినా మూడు కాసులు కూడా కూడబెట్టుకోలేక పోయాడు. ఆయన గొప్ప తనానికి గుర్తుగా ఒంగోలు కొత్త జిల్లా ఏర్పడినపుడు ప్రకాశం జిల్లాగా నామకరణం చేశారు. ఆరు దశబ్దాల తర్వాతయితే ఏముంది, ఆంధ్రప్రదేశ ప్రభుత్వం తొలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదినాన్ని రాష్ట్ర పండగల జాబితాలో చేర్చింది. ఆయన పుట్టిన వూరు వినోదరాయుని పాలెంలో విగ్రహ ప్రతిష్ట జరుగుతున్నది. ఆయన పేరు మీద ఎన్నోవూర్లలో ప్రకాశం స్కూళ్లున్నాయి. ఇది ఆయన సాంఘిక జీవితం. అయితే, రాజకీయ జీవితం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
ఆయన ఎంతో గొప్ప సంఘసేవకుడు, త్యాగశీలి, నిస్వార్థ నాయకుడు కావచ్చు. రాజకీయాలలో ఆయన అజాత శత్రువు కాదు. ఆయనకు చుట్టూరు గిట్టని వాళ్లే వున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా తాను తొలుత ముఖ్యమంత్రి గా పనిచేసిన మద్రాసు రాష్ట్రంలో ఆయన స్వాతంత్య్రం వచ్చాక జరిగిన తొలిఎన్నికల్లో ఓడిపోయారు. 1952 ఎన్నికల్లో ఆయన మద్రాసు హార్బర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అక్కడ ఆయన తీవ్రపరాభవం పాలయ్యరు. కనీసం రెండో స్థానంలో కూడా నిలవలేకపోయారు. అక్కడ కృష్ణారావు అనే అభ్యర్థి గెలిచాడు,ఇబ్రహీం సాబ్ రెండో స్థానంలో ఉన్నారు.
తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్ర వచ్చినపుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఆంధ్రుల తొలి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కూడా కాదు. అంతేకాదు,ఆయన కాంగ్రెస్ లో కూడా లేరు. ప్రజసోషలిస్టుపార్టీ లోఉన్నారు. ముఖ్యమంత్రి గా కాంగ్రెస్ ఆయనను ప్రతిపాదించినపుడు, ఆయన వర్గం పార్టీ నుంచి బయటకు వచ్చి ‘ప్రజా పార్టీ’ గా మారి కాంగ్రెస్ తో చేతులు కలిపింది. మరి ఆరునెలలో ఎమ్మెల్యే కావాలి కదా...
అపుడు శృంగవరపు కోట అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే సివి సోమయాజులు తన పదవికి రాజీనామా చేసి ప్రకాశం కు అవకాశం కల్పించారు. ఆయన ఏకగ్రీవంగా ఆంధ్ర అసెంబ్లీకి వచ్చారు. అంటే, ఆంధ్ర అసెంబ్లీలో కొత్త రాష్ట్ర నుంచి మొదట గెలుపొందింది ప్రకాశం పంతులే. మిగతా వాళ్లంతా మద్రాసు రాష్ట్ర అసెంబ్లీ కి గెలిచిన వారే.
1946 మద్రాసు ప్రెసిడెన్సీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెల్చాక ప్రకాశం పంతులు ఏప్రిల్ 30 ముఖ్యమంత్రి అయ్యారు. గాంధీజీ మాత్రం రాజాజీ ముఖ్యమంత్రి కావాలని కాంక్షించారు. ఇదే అక్కడ ముఠా తగాదాలకు కారణమయింది. ఈ లోపు ప్రకాశం ప్రభుతం మీద తిరుగుబాటు మొదలయింది. అనేక ఆరోపణలు వచ్చాయి. గాంధీజీ అసంతృప్తి వ్యక్తం చేశారు. 11 నెలల్లోనే ప్రకాశం ప్రభుత్వం కూలిపోయింది.
ఇక కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్ర ఏర్పడ్డాక కాంగ్రెస్ నాయకత్వం ఆయన్ని ముఖ్యమంత్రి గా ఉండాలని కోరింది. అంతాపైకి ఒప్పుకున్నారు. ఏడాదయిందో లేదో ఆయన ప్రభుత్వం మీద చాలా మందికి అసంతృప్తి వచ్చిది. 1954 అక్టోబర్ 6న ఆయన ప్రభుత్వం మీద అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టారు. ఆయన ప్రభుత్వం ఓడిపోయింది.
Read more news at Asianet-Telugu Express News
