ప్రపంచ తెలుగు మహాసభల్లో గిదేంది వయ్యా?

ప్రపంచ తెలుగు మహాసభల్లో గిదేంది వయ్యా?

 హైదరాబాద్ లో ఈ నెల 15నుంచి  ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతన్నాయి. 19 దాకా ఈ మహాసభలు, తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి గురించి చర్చిస్తాయి. తెలుగు భాష ను పరిరక్షించుకునేందుకు ఏమేమిచేయాలో తీర్మానాలు చేసి ప్రభుత్వానికి అందిస్తాయి.దాదాపు నూరుకోట్లదాకా ఈ సభలకు ఖర్చవుతున్నాయని చెబుతున్నారు. ఒక గొప్ప తెలుగు వేడుకుగా నాలుగు రోజుల కార్యక్రమాలను సాగనున్నాయి.

అయితే, ఇందులో తెలుగు చాలా తక్కువగా ఉందని , ఇది తెలుగు భాషాభివృద్ధికి దోహదపడేలాగా లేదని  ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు వంటి విమర్శిస్తున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం పతనవాస్థలో ఉంది. రాష్ట్రంలో లైబ్రరీలు దీనావాస్థలో ఉన్నాయి. ఆర్కైవ్స్ ఎవరూ పట్టించుకోవడం లేదు. తెలుగు మీడియం ఎత్తేస్తున్నారు. ఈ నిధులలో అయిదు శాతం వాటి మీద ఖర్చు చేసినా తెలుగు భాషాభివృద్ధి బాగా జరగుతుందని ఆయన చెబుతున్నారు.

 తెలుగు మహాసభల్లో తెలుగు కంటే ఇంగ్లీషే ఎక్కువగా కనబడుతున్నదని  మరొక విమర్శవుంది. ఇంగ్లీష్ ను తెలుగులో రాసే ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. దీనికి సాక్ష్యం గా ఈ పోస్టర్ నూ చూపిస్తున్నారు.

ఇందులో  కెసిఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి అనడానికి బదులు చీఫ్ మినిష్టర్ ఆఫ్ తెలంగాణ అని తెలుగు లిపిలో రాశారు. ముఖ్యమంత్రి ఫోటో కింది హాబీ'బ్లీ చీఫ్ మినిస్టర్ ఆప్ తెలంగాణ అని రాశారు.  దీని భావమేమిటో తెలుగు వాళ్లకి ఎవరైనా చెప్పగలరా?

హాబీ'బ్లీ అంటే అర్థం ఎవరికైనా  స్ఫురించిందా...

ఇందులో గ్రీక్ అండ్ లాటిన్ లాగా కనబడుతుంది గాని... అంతసీన్ .

ముఖ్యమంత్రి బొమ్మ కింద  Hon'ble chief minister of Telangana ని తెలుగులో రాయమన్నారు. అక్షరాలా దానిని తెలుగులో  హాబీ బ్లీ అని రాసి పడేశారు. ఎవరూ చూల్లేదు.  వ్యవహారం ఎంత సీరియస్ గా ఉందో అర్థమవుతున్నది కదా.

 

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos