పచ్చబొట్టుకి ప్రాణం వస్తే..

Engineers 3D print a living tattoo
Highlights

  • కొందరు వారికి నచ్చిన వారి పేర్లను ఒంటిపై చెక్కించుకుంటుంటే.. మరికొందరు బొమ్మలను, నచ్చిన ఆకృతులను టాటూగా వేయించుకుంటున్నారు.

పచ్చబొట్టు అదేనండి టాటూస్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినీ ప్రముఖుల నుంచి సాధారణ యువత వరకు  ఇప్పుడు పచ్చబొట్టుపై ఆసక్తి చూపిస్తున్నవారే. ఎవరికి నచ్చిన ప్లేస్ లో వాళ్లు ఒంటిపై టాటూస్ వేయించుకుంటున్నారు. కొందరు వారికి నచ్చిన వారి పేర్లను ఒంటిపై చెక్కించుకుంటుంటే.. మరికొందరు బొమ్మలను, నచ్చిన ఆకృతులను టాటూగా వేయించుకుంటున్నారు. ఈ టాటూస్ లో పర్మినెంట్ టాటూస్, టెంపరరీ టాటూస్ అనే రకాలు కూడా ఉన్నాయి. అయితే.. ఇప్పుడు మరో రకం టాటూ అడుగుపెట్టింది. అదే 3డీ టాటూ.

జన్యుమార్పులు చేసిన లైవ్ సెల్స్ తో కొత్తరకం త్రీడీ టాటూని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిని శరీరం పైన వేసుకోవడం కూడా చాలా సులభం. ఎలాంటి నొప్పి, హడావిడీ లేకుండా.. కేవలం ఒక స్టిక్కర్ లాగా అంటించుకుంటే సరిపోతుంది. దీనిలో మరో స్పెషల్ ఏమిటంటే.. ఈ టాటూ చూడటానికి కదులుతుందా అనిపిస్తుంది. నిజంగా పచ్చబొట్టుకి ప్రాణం వస్తే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది.  అందుకే దీనిని ‘ లివింగ్ టాటూ’ అని పేరు పెట్టారు.

అమెరికాలోని మస్సాచుసెట్స్ సాంకేతిక విద్యాసంస్థ( ఎంఐటీ) నిపుణులు దీనిని తయారు చేశారు. దీనిలో ప్రత్యేకంగా మార్పులు చేసిన కణాలను ఉపయోగించారు. ఈ టాటూని పొరలుపొరలుగా ముంద్రించే వీలుంటుంది. వీటికి హెడ్రోజెల్ ని కలిపి మొట్టమొదటగా చెట్టు ఆకారంలో పచ్చబొట్టును 3డీ విధానంలో వేశారు. అంతేకాదండి.. ఈ టాటూ స్టిక్కర్ చాలా పలుచగా ఉంటుంది. త్వరలోనే ఈ త్రీడీ టాటూలు మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాయనమాట.

loader