Asianet News TeluguAsianet News Telugu

జమైకా చిరుత పరుగు ఆగింది

  • చివరి పరుగు పూర్తి చేసుకున్న బోల్ట్
  • చివరి పరుగులో నిరాశ పర్చిన బోల్ట్
  • మూడవ స్థానంలో నిలిచిన బోల్ట్
end of usain bolt run

మ‌నిషి రూపం లో మ‌రో చిరుత గా పెరొందిన ఉస్సేన్ బోల్ట్‌. ఇక త‌న ప‌రుగును ఆస్వాధించ‌లేము. త‌న చివ‌రి ప‌రుగు ను పూర్తి చేశాడు బోల్ట్. ప్రపంచవ్యాప్తంగా బోల్ట్‌ పరుగుతో గత కొన్నేళ్లుగా అభిమానులను ఉర్రూతలూగించిన జమైకా బంగారు చిరుత ఉసేన్‌ బోల్ట్ త‌న కెరీర్ ముగించాడు

ఉస్సేన్ బోల్ట్ దాదాపుగా అన్ని ఈవేంట్ల‌లో బంగారు ప‌థ‌కాల‌ను సాధించాడు. కానీ చిట్ట చివ‌రి పరుగును మాత్రం కాంస్యంతో ముగించాడు. లండన్‌ వేదికగా జరుగుతున్న ఐఏఏఎఫ్‌ ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో బోల్ట్‌ చివరిసారిగా పాల్గొని కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. 

లండ‌న్ లో శనివారం అర్ధరాత్రి జరిగిన 100 మీటర్ల రేసులో బోల్ట్‌ తన జోరు కొనసాగించలేకపోయాడు. కేవ‌లం సెక‌న్ల వెన‌క‌బాటుతో మూడ‌వ స్థానంలో నిలిచాడు. బోల్ట్‌ 9.95 సెకన్లలో రేసును పూర్తి చేశాడు.త‌న చివ‌రి ప‌రుగ‌ను కాంస్యంతో స‌రిపెట్టుకున్నాడు. బోల్ట్ త‌న చివ‌రి పరుగును చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది హృద‌యాలను కొల్ల‌గోట్టిన బోల్ట్ ప్ర‌స్తానం ముగిసింది. 


 బోల్ట్ వ‌య‌స్సు ప్ర‌స్తుతం 30 సంవ‌త్స‌రాలు, త‌ను త‌రువాత పుట్‌బాల్, లేదా క్రికేట్ లోకి రానున్నాడు. త‌న‌కి వెస్టిండీస్ క్రికెట్ జ‌ట్టుకు బౌల‌ర్ గా ఆడాల‌ని త‌న కోరిక‌ను బ‌య‌ట పెట్టాడు. ఇక పుట్‌బాల్ లో మంచైస్ట‌ర్ జ‌ట్టుకు ప్రాతినిథ్యం మ‌హించాల‌ని ఆయ‌న ప‌లు మార్లు అన్నారు. ఇక ఏ రూపం త‌న కెరీర్ ను ప్రారంభిస్తాడో... చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios