ఎయిమ్స్ వైద్య నిపుణులు ఆసుపత్రికి చేరుకున్న తర్వాత ‘అమ్మ’కు సంబంధించిన ఓ ప్రకటన లాంఛనంగా చేయవచ్చని తెలుస్తోంది.

పన్నీర్ సెల్వమే తదుపరి పూర్తిస్ధాయి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వ వర్గాలు ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. పురట్చితలైవి జయలలిత(68) హయాం దాదాపు ముగిసట్లేనని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఆదివారం రాత్రి నుండి ప్రభుత్వ వర్గాల హడావుడిని నిశితంగా గమనిస్తే ఆదివారం సాయంత్రమే జరగకూడనిది జరిగినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఎత్తున రాష్ట్ర పోలీసు, కేంద్ర బలగాలను రంగంలోకి దింపుతోంది. తమిళనాడు రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలతో ఉన్న అన్నీ సరిహద్దులను మూసేసారు. సున్నిత ప్రాంతాలుగా గుర్తించిన ప్రతీ ప్రాంతంలోనూ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దింపుతున్నారు.

దేశంలోని అత్యంత ప్రముఖులందరూ చెన్నైకు క్యూ కట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఈ సాయత్రానికి గానీ మంగళవారం ఉదయానికి గాని చెన్నైకి చేరుకోవచ్చని సమాచారం. ఇదిలావుండగా తమిళనాడులోని ‘అమ్మ’ అభిమానులు జరుగుతున్న పరిణామాలను చూస్తూ కన్నీరు మున్నీరవతున్నారు. ఎయిమ్స్ వైద్య నిపుణులు ఆసుపత్రికి చేరుకున్న తర్వాత ‘అమ్మ’కు సంబంధించిన ఓ ప్రకటన లాంఛనంగా చేయవచ్చని తెలుస్తోంది.