5 మందిని చంపేసిన ఏనుగు కోసం వేట..  జార్ఖండ్‌ ప్రభుత్వ అభ్యర్థనతో రంగంలోకి నవాబ్ షఫత్ అలీ ఖాన్ నేడు(ఆగస్టు 12) ప్రంపంచ ఏనుగుల దినోత్సవం

గ్రామలమీదపడి జనాన్ని చంపేస్తోన్న మదపుటేనుగు ఆటకట్టించారు. హైదరాబాద్‌కు చెందిన టాప్‌ హంటర్‌ నవాబ్‌ షఫత్‌ అలీ ఖాన్‌ దాని ఆకట్టించేందుకు రంగంలోకి దిగారు.

అసలు ఏం జరిగిందంటే..జార్ఖండ్‌-బిహార్‌ సరిహద్దులోని షహీబ్‌గంజ్‌ అభయారణ్యంలో ఇటీవల ఓ ఏనుగు మంద నుంచి తప్పిపోయింది. ఆ ఏనుగు అభయారణ్యంలోని గ్రామస్థులపై విరుచుకుపడుతోంది. ఈ అబయారణ్యంలో ఎక్కువగా పహారియా తెగకు చెందిన ఆదివాసీలు జీవిస్తున్నారు. ఏనుగు దాడిలో మొత్తం 15మంది చనిపోగా వారిలో 9మంది పహారియా తెగకు చెందినవారే కావడం గమనార్హం. ఈ మదపు ఏనుగ వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పడు వచ్చి.. ఎవరి మీద పడి ప్రాణాలు తీసేస్తుందో అని ఆదివాసులు బయపడిపోతున్నారు.ఆ ఏనుగు బారి నుంచి రక్షించమని వారు అటవీ శాఖ అధికారులను వేడుకుంటున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అటవీశాఖ అధికారులు కూడా విశ్వ ప్రయత్నమే చేశారు. కానీ ఏ ఒక్కటీ ఫలించలేదు. దీంతో చేసేదేమీ లేక దానిని చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎవరు చంపాలని అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.

 ఆ మదపుటేనుగును చంపే లైసెన్స్డ్ హంటర్ హైదరాబాద్ లో ఉన్నారని తెలుసుకొన్నారు.

నవాబ్‌ షఫత్‌ అలీ ఖాన్‌.. దేశంలోనే ఏకైక లైసెన్స్డ్ హంటర్. వేటగాడిగా 40 ఏళ్ల అనుభవం ఉంది. దీంతో ఆయన గురించి తెలుసుకున్న ఝార్ఖండ్ ప్రభుత్వం నవాబ్ ని సంప్రదించింది. ఆయన కూడా ఏనుగును చంపేందుకు అంగీకరించారు. రెండు రోజుల పాటు.. ఆయన దానిని వేటాడి.. తన తూటాతో తుదమట్టించారు.

నవాబ్ ఇప్పటి వరకు పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల సూచన మేరకు 12 చిరుతపులులను, 7 ఏనుగులను, 3 పులులను హతమార్చారు. 15,200 అడవి పందులు, 1300 అడవి కుక్కలు, 1000 అడవి దున్నలు కూడా నవాబ్‌ తూటాలకు నేలకొరిగాయి.

ఇదిలా ఉంటే, ఆగస్టు 12.. ప్రపంచ ఏనుగుల దినోత్సవం కావడంతో నవాజ్‌ హంటింగ్‌పై జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వాలు క్రూరజంతువులను చంపించేందుకు నవాజ్‌ను పిలిపించడంపై కేంద్ర మంత్రి మనేకా గాంధీ సాక్షాత్తు పార్లమెంట్‌లోనే మండిపడ్డారు. విమర్శల సంగతి ఎలా ఉన్నా నవాజ్‌ మాత్రం తన పని తాను చేసుకుపొతున్నారు.