మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ లాలూ కుమార్తె, ఎంపీ మిసా భారతీ ఢిల్లీ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు దాడులు నిర్వహించారు. మిసాభారతీ ఆమె భర్త శైలేష్‌ కుమార్‌ను లను ఇడి అధికారులు జూన్ లోనే ప్రశ్నించారు. సైనిక్ ఫామ్ తో పాటు ఢిల్లీలోని మూడుచోట్ల ఈ దాడులు కొనసాగుతున్నాయి.

మీసా, భర్త శైలేష్ బినామి లాండ్ ట్రాన్సాక్షన్స్ జరిపారన్నది ప్రధాన ఆరోపణ. ఇంతవరకు ఐటి అధికారులు మీసా భారత, భర్త శైలేష్, బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తేజస్వియాదవ్, మాజీ బీహార్ ముఖ్యమంత్రి రబ్డీ దేవిలకు సంబంధించిన 12 ప్లాట్ లను అటాచ్ చేశారు.వీటి విలువ 9.32 కోటరుపాయలు. అయితే, వాటి మార్కెట్ విలువ 175 కోట్ల దాకా ఉంటుందని అంచనా.

.
నిన్న సీబీఐ అధికారులు పట్నాలోని లాలూ ఇంటితో పాటు కుటుంబ సభ్యలకు చెందిన  12 స్థావరాలపై ఏకకాలంలో దాడులు చేసిన సంగతి తెలిసిందే. అతి తక్కువ ధరలకే భూములు పొందారని, పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులు కూడ బెట్టారనే ఆరోపణల కింద ఇడి దాడులు నిర్వహిస్తున్నది.

 

తమ కంపెనీల పేరిట బారీగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారని, వీటికి సరైన పత్రాలు కూడ సమర్పించలేదని అధికారులు చెబుతున్నారు.