కేంద్ర ఎన్నికల కమిషన్ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల  చేసింది.

కేంద్ర ఎన్నికల కమిషన్ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.

దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జూలై 29 న విడుదల అవుతుంది.

నామినేషన్ వేసేందుకు ఆగస్టు 5 చివరి తేదీ. ఆగస్టు 9 నామినేషన్ల ఉప సంహరణకు గడువు.

పోలింగ్ ఆగస్టు 23న జరుగుతుంది.

ఓట్ల లెక్కింపు ఆగస్టు 28 న ఉంటుంది.

షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ మరుక్షణం నుంచి అమలులోకి వచ్చింది.

నంద్యాలలో శాసన సభ్యులు భూమా నాగిరెడ్డి మృతితో ఎర్పడిన ఈ స్థానం ఖాళీ అయింది.

2014 ఎన్నికలలో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి భూమా నాగిరెడ్డి టిడిపి అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి మీద గెలుపొందారు. గత ఏడాది ఫిబ్రవరిలో

భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరారు. ఈ ఏడాది మార్చి 12న ఆయన గుండెపోటుతో మరణించారు.

ఇపుడు శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.

భూమా నాగిరెడ్డి అన్న కొడుకు బ్రహ్మానందరెడ్డి టిడిపి అభ్యర్థిగా నిలబడ్డారు.

రకరకాల కారణాలతో ఈ ఎన్నిక తెలుగుదేశం ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన మీద రెఫరెండం అన్నట్లుగా సాగుతూ ఉంది.

అందుకే చాలా రోజులుగా షెడ్యూల్ కోసం రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి.

ఇపుడు షెడ్యూల్ విడుదలయింది.