శాకాహారులతో పోలిస్తే.. మాంసాహారుల్లో డయాబెటిక్ సమస్య ఎక్కువ రెడ్ మీట్, .. పౌల్ట్రీ ప్రోడక్ట్స్ లో హెమీ ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుందట. దాని వల్ల షుగర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మితిగా తీసుకుంటే.. ఏ ఆహారమైనా శరీరానికి మేలు చేస్తుంది. అది మాంసాహారమే కానివ్వండి.. ఇంకేదైనా కానివ్వండి.అలా కాదని అతిగా తీసుకుంటే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు విషయానికి వస్తే.. రెడ్ మీట్( పంది, గొడ్డు మాంసం, గొర్రె, మేకల మాంసం)ని ఎక్కువగా తీసుకుంటే... డయాబెటిక్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కేవలం రెడ్ మీటే కాదు.. పౌల్ట్రీ ప్రోడక్ట్స్( చికెన్, చికెన్ లివన్, బాతు) తిన్నా కూడా ఇదే సమస్య తలెత్తే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు..
సింగపూర్ లోని ప్రజలు అధికంగా షుగర్ వ్యాధి బారిన పడుతున్నారట. దీంతో దీనిపై ఎన్ యూఎస్ మెడికల్ స్కూల్ కి చెందిన పలువురు నిపుణులు పరిశోధనలు జరిపారు. వారి పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
సింగపూర్ చైనీస్ హెల్త్ స్టడీస్ తెలిపిన వివరాల ప్రకారం.. శాకాహారులతో పోలిస్తే.. మాంసాహారుల్లో డయాబెటిక్ సమస్య ఎక్కువగా ఉందని తేలింది. రెడ్ మీట్, .. పౌల్ట్రీ ప్రోడక్ట్స్ లో హెమీ ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుందట. దాని వల్ల షుగర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఐరన్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి హెమీ ఐరన్. మరొకటి నాన్ హెమీ ఐరన్. చికెన్, మటన్ వంటి వాటిలో ఈ హెమీ ఐరన్ ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లలో ఈ హెమీ ఐరన్ ఉండదు. ఈ హెమీ ఐరన్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకుంటే షుగుర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇవి ఎక్కువగా తినడం వలన.. సాధారణంగా వచ్చే దానికంటే 23శాతం ఎక్కువ అవకాశం ఉందని తేలుస్తోంది. అదే ఫిష్.. షెల్ ఫిష్ వంటి ఆహారం తినడం వలన ఇలాంటి సమస్య రాదని వారు చెబుతున్నారు. దీని వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం ఉండదని వారు తెలిపారు. ఐరన్ శాతం తక్కువగా ఉండే మాంసాహారాన్ని తీసుకుంటే మంచిదని వారు చెబుతున్నారు. లెగ్ పీసులకు బదులు రొమ్ము మాంసం తీసుకుంటే మంచిదని.. అందులో హెమీ ఐరన్ తక్కువగా ఉంటుందని వారు చెప్పారు.రెడ్ మీట్ కి బదులుగా ఫిష్.. షెల్ ఫిష్ వంటి ఆహారం తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
