అఫ్గనిస్తాన్ లో భూకంపం: ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ల్లో ప్రకంపనలు

First Published 9, May 2018, 5:07 PM IST
Earthquake hits Afghanisthann: tremors felt in North India
Highlights

అఫ్ఘనిస్తాన్ లో భూకంపం బుధవారం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై అది 6.2గా నమోదైంది. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలు సహా ఉత్తర భారతదేశంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 

కాబూల్: అఫ్ఘనిస్తాన్ లో భూకంపం బుధవారం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై అది 6.2గా నమోదైంది. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలు సహా ఉత్తర భారతదేశంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 

హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాల్లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంప కేంద్రం అఫ్గనిస్తాన్, కజగిస్తాన్ సరిహద్దుల్లో ఉంది.

ఢిల్లీలో ఎత్తయిన భవనాలు కొద్ది క్షణాలు చలించినట్లు చెబుతున్నారు. బుధవారం సాయంత్రం 4.15 నిమిషాలకు భూకంపం అఫ్గనిస్తాన్ ను తాకింది. భారతదేశంలో ప్రాణాలకు ఏ విధమైన నష్టం వాటిల్లలేదు. 

అంతకు ముందు పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో భూకంపం వచ్చింది. అది రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. 

loader