రియో కంపెనీ ‘డాటా’ ఫ్రీ అంటోంది... ప్రధానమంత్రి ‘డాటా’ వాడాలంటున్నారు.దేశంలో సగం మందికి ‘ఆటా’ కొనడానికే దిక్కు లేదు.. కానీ, అందరూ డాటా... డాటా... అంటూ పిలుపునిస్తున్నారు.ఈ ఫ్రీ డాటా పిలుపు వెనక ఎన్ని 2 జి, 3 జి, 4 జి, 5 జి స్కాంలున్నాయో ఎవరికి తెలుసు..
దేశాన్ని రాజకీయ నేతలు పాలిస్తారు... వారిని పారిశ్రామిక వేత్తలు శాసిస్తారు..
ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఇప్పటి వరకు దేశంలో పాలన ఇలానే కొనసాగుతోంది.
కానీ, మనకు పరిపాలించే ఖద్దరు నేతలే కనిపిస్తారు.. వారిని నడిపించే బడా బాబులు మాత్రం ఎప్పటికీ కనిపించరు.
ఈ ఒక్క పాయింట్ ను ఆధారంగా చేసుకొనే ధృవ సినిమా వచ్చింది. ఇండస్ట్రీలో హిట్ టాక్ కూడా తెచ్చుకుంది.
ధృవ ఒక సినిమా కావొచ్చు... కానీ, రియో ఒక వాస్తవం..
ఏంటీ ఈ రెండింటికి పోలిక అనుకుంటున్నారా...
ఈ రెండింటిని గమనిస్తే ఎక్కడో కనక్ట్ అవడం లేదు...
ఆ బడా కంపెనీ ‘రియో’ ఆఫర్ తీసుకొచ్చింది. పోటీ దారులను అడ్రస్ లేకుండా చేసింది.
కేవలం డాటా కే డబ్బులు చెల్లించండి.. కాల్స్ ఫ్రీ గా పొందండి అంటూ భలే ఆఫర్ ఇచ్చింది. క్యూలో నిలబడి మరీ సిమ్ లో కొనేశాం.
కానీ, ఈ ఆఫర్ వచ్చిన తర్వాతే
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్లను ఒక్క ప్రకటనతో రద్దు చేశారు.
అక్కడితో ఆగకుండా దేశమంతా డిజిటల్ కావాలి.. ప్రజలందరూ డాటా వాడాలి అని ఊరువాడా వెళ్లి ఊదరగొడుతున్నారు.
రియో కంపెనీ ‘డాటా’ ఫ్రీ అంటోంది... ప్రధానమంత్రి ‘డాటా’ వాడాలంటున్నారు.
దేశంలో సగం మందికి ‘ఆటా’ కొనడానికే దిక్కు లేదు.. కానీ, అందరూ డాటా... డాటా... అంటూ పిలుపునిస్తున్నారు.
ఈ ఫ్రీ డాటా పిలుపు వెనక ఎన్ని 2 జి, 3 జి, 4 జి, 5 జి స్కాంలున్నాయో ఎవరికి తెలుసు..
ఈ ఉచిత పెట్టుబడి తర్వాత ఎందరికి రాబడిగా మారుతుందో ఎవరికి తెలుసు...
అందుకే ధృవ ఒక సినిమా... రిమో ఒక వాస్తవం.. సేమ్ టు సేమ్.
